తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TDP Chief Nara Chandrababu Naidu Arrest: ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు అరెస్టు

TDP Chief Nara Chandrababu Naidu Arrest : తాలిబన్లను తలదన్నేంతటి అరాచకత్వంతో ఏపీని ఏలుతున్న జగన్.. ప్రతిపక్షాలు, విమర్శనా గళాలపై విపరీతమైన జులుం ప్రదర్శిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టు.. విష దరహాసాల వైసీపీ అధినేతలో పరాకాష్ఠకు చేరిన పైశాచికత్వానికి ప్రబల నిదర్శనం. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ చెప్పిందే చట్టం.. ఆయన చేసిందే న్యాయం..! జగన్ దృష్టిలో శాంతిభద్రతలను నిలబెట్టడమంటే.. తన వ్యతిరేకులను కుళ్లబొడవటమే.

Nara Chandrababu Naidu Arrest
TDP Chief Nara Chandrababu Naidu Arrest

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 6:48 AM IST

Updated : Sep 10, 2023, 8:15 AM IST

TDP Chief Nara Chandrababu Naidu Arrest ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు అరెస్టు

TDP Chief Nara Chandrababu Naidu Arrest : రాజ్యాంగ ప్రమాణాలు, సుప్రీంకోర్టు గత నిర్దేశాలు, సహజ న్యాయసూత్రాలు, చట్టబద్ధమైన పాలనా విలువలు వంటివి ఏమీ జగన్​మోహన్​ రెడ్డి(Jagan Reddy)కి అర్థం కావు. మూర్ఖత్వం మూర్తీభవించిన మొండి రాజు మాదిరిగా నిరంకుశాధికారాన్ని చలాయిస్తున్న జగన్‌కు తెలిసిందల్లా తనకు తలవంచని వారందరినీ చెండుకు తినడమే..!

లేకపోతే నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్న నాయకుణ్ని, హైబీపీ షుగర్‌లతో బాధపడుతున్న 74 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి అర్ధరాత్రి పూట పోలీసులు అంకమ్మ శివాలు వేయడమేమిటి? బస్సు అద్దాలు బాదుతూ, న్యాయవాదులనూ తూలనాడుతూ నంద్యాల వీధుల్లో వారు వీరంగమాడటమేమిటి? రెండేళ్ల క్రితం నమోదైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల జాబితాలో చంద్రబాబు పేరే లేదు. అలాంటప్పుడు తాడూ బొంగరం లేని ఆధారాలతో ఉన్నపళాన ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరమేమొచ్చింది? పగతో పొరలు కమ్మిన జగన్ కళ్లలో వికృతానందం చూడటం కోసమేనా ఏపీ సీఐడీ ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టింది?

ప్రాణ త్యాగానికి సిద్ధమన్న బాబు.. పిచ్చోడు లండన్‌కి మంచోడు జైలుకా..?లోకేష్‌ ఆగ్రహం.. తండ్రిని చూడాలంటే పోలీసుల అనుమతి కావాలా..?

Ex Chief Minister Chandrababu Arrest : "సీఐడీ పోలీసుల అత్యుత్సాహం చూస్తుంటే.. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని సంతృప్తి పరచడానికే అన్నట్టుంది. సరైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, దర్యాప్తు ముసుగులో ప్రజలను వేధింపులకు గురిచేయడం అరాచకత్వానికి దారితీస్తాయి. "ప్రజలు ప్రజాస్వామ్యంలో కాకుండా ఖాకీస్వామ్యంలో జీవిస్తున్నారనే భావనను అధికారులు కలిగిస్తున్నారు" అంటూ ఏపీ హైకోర్టు మూడేళ్ల నాడే తీవ్రంగా తలంటింది. అయినప్పటికీ వైసీపీకు పొర్లుదండాలు పెట్టడం మానని ఖాకీలు.. జగన్ ప్రైవేటు సైన్యంగానే పనిచేస్తున్నారు!

వారెంటు లేకుండా ఎవరినైనా అరెస్టు చేసేటప్పుడు.. సంబంధిత నేర వివరాలను ఆ వ్యక్తికి తెలియజేయాలని.., ఖైదులోకి తీసుకోవడానికి గల కారణాలను అతనికి వెంటనే చెప్పాలని సీఆర్‌పీసీ సెక్షన్ 51(1) స్పష్టంగా చెబుతోంది. అదే నిబంధన కింద చంద్రబాబుకు నోటీసిచ్చిన పోలీసులు.. అరెస్టుకు కారణాలేమిటో ఆయన ఎంతగా అడిగినా చెప్పనేలేదు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు విశ్రాంతి తీసుకుంటున్న బస్సును అలాగే లాక్కెళ్లిపోతామంటూ టీడీపీ శ్రేణులపై ఖాకీ కండకావరంతో ఎగిరెగిరి పడ్డారు. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ కుంభకోణానికి చంద్రబాబే సూత్రధారి అన్నట్టుగా మొన్న మార్చిలో శాసనసభ వేదికగా సీఎం జగన్ తనదైన అభినయ కౌశలంతో ఆరోపించారు.

Chandrababu Naidu Arrested in Corruption Case : శనివారం సీఐడీ అధిపతి ఎన్.సంజయ్ మాట్లాడుతూ.. చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని తేల్చేశారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఆయన తన యజమాని మాటలకు వంతపాడారు. ఏదో రకంగా చంద్రబాబు మీద బురద జల్లాలన్న జగన్ ఉన్మాద ఆలోచనల్లోంచే చట్టాలను పెళ్లగించే అసలు కుట్ర పురుడుపోసుకుంది. పబ్లిక్ సర్వెంట్లపై ఆరోపితమైన అపరాధాల్లో ముందస్తు అనుమతి లేకుండా పోలీసు అధికారులెవరూ దర్యాప్తు చేపట్టకూడదని 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఎ) స్పష్టం చేస్తోంది.

దాని ప్రకారం చంద్రబాబుపై దర్యాప్తునకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వంటివారు అంటున్నారు. వైసీపీ రాక్షస అజెండాను నెత్తినమోసే విశ్వసనీయ భృత్యుగణ అవతారాలెత్తిన పోలీసులేమో.. తమకు అలవాటైన పద్ధతిలోనే చట్టాలకు సమాధి కడుతున్నారు.

Chandrababu Naidu Arrested by AP CID : జనాన్ని దోచుకుతినే చెడ్డీ గ్యాంగ్ తరహాలో జగన్ అంతేవాసులు నేడు రాష్ట్రంలో చెలరేగిపోతున్నారు. వాళ్లపై అమిత ప్రేమాభిమానాలను ఒలకబోస్తున్న పోలీసులు.. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల గొంతులను కర్కశంగా నులిమేస్తున్నారు. 'అడుగు ముందుకేస్తే కాల్చిపారేస్తా', 'నిరసనకు కూర్చో.. నీ కథ తేలుస్తా' అంటూ విపక్ష శ్రేణులపై మీసాలు దువ్వుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ నేత పట్టాభిలపై ఖాకీ మార్కు క్రౌర్య ప్రదర్శనల నుంచి ఇటీవల నారా లోకేశ్​ 'యువగళం' వాలంటీర్లను చావచితక్కొట్టడం వరకు పోలీసుల దాష్టీకాలు.. అన్నీ ఇన్నీ కావు.

మొన్నామధ్య డీజీపీ కార్యాలయానికి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిచేసినప్పుడైతే.. ఖాకీ వీరులు ఆ చుట్టుపక్కల ఎక్కడా కనపడనే లేదు. అదే పోలీసు యంత్రాంగం జనసేనాధిపతి పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన సమయంలో అడుగడుగునా అడ్డం పడింది. సామాజిక మాధ్యమాల్లో జగన్ సర్కారు మీద రాజకీయ విమర్శలు చేస్తున్నవారిపై ఒకపక్క లాఠీలు విరుగుతున్నాయి. వైసీపీ కిరాతకుల దుడ్డుకర్రలేమో అటుపక్క ప్రత్యర్థుల తలలు పగలగొడుతున్నాయి.

AP Governer on Chandrababu Arrest చంద్రబాబు అరెస్టుపై సమాచారం ఇవ్వకపోవటంపై గవర్నర్‌ విస్మయం ? టీడీపీ నేతలతో భేటీకి అపాయింట్​మెంట్..!

Chandrababu Naidu Arrest Latest News :నిరుడు ధర్మవరంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన బీజేపీ నేతలపై వైసీపీ గూండాలు అలాగే దాడిచేశారు. చట్టానికి విధేయులుగా మెలగాల్సిన పోలీసులు జగన్ పాదపూజకు పోటీపడుతుండటం వల్లే- సుప్రీంకోర్టు నిర్దేశాలూ రాష్ట్రంలో బేఖాతరవుతున్నాయి. 'అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు అరెస్టులు చేయరాదు' అని సర్వోన్నత న్యాయస్థానం రెండేళ్ల క్రితమే గిరిగీసింది. హేయనేరాల్లో, సాక్షులను ప్రభావితం చేసే లేదా పరారయ్యే అవకాశం ఉన్న సందర్భాల్లోనే సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని న్యాయపాలిక తీర్పిచ్చింది. చంద్రబాబు విషయంలో వీటిలో ఏది వర్తిస్తుందని పోలీసులు కన్నూమిన్నూ కానకుండా రెచ్చిపోయారు?

Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్​.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు

Chandrababu Naidu Arrested in Skill Development Scam Case :గురివింద గింజ తనలోని నలుపును ఎరగదన్నట్లు నంగనాచి కబుర్లెన్నో చెప్పే జగన్.. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 38 కేసుల్లో నిందితుడు. బెయిల్‌ మీద బయట తిరుగుతున్న పెద్దమనిషి. చేజేతులా తాను అంటించుకున్న అవినీతి మకిలిని తనకు గిట్టనివారికీ బలవంతంగా పులమాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు అంతకుమించిన ప్రోద్బలమేదీ కనిపించడం లేదు. యావద్దేశం దృష్టంతా జీ20 సమావేశాలపైనే ఉన్న సమయంలో నిశిరాత్రి వేళ చంద్రబాబు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టడం.. జగన్‌ పైత్య ప్రకోపం తారస్థాయికి చేరినట్లు చాటుతోంది. పాపం పండినరోజు ఎంతటి నిరంకుశ ప్రభువైనా ప్రజాగ్రహ ఉద్ధృతిలో కొట్టుకుపోక తప్పదు. వచ్చే ఎన్నికల్లో జాగృత జనవాహిని చేతుల్లో జగన్‌కు ఘోర పరాభవం తప్పదు.

First published by EENADU

AP CID Chief Sanjay on Chandrababu Naidu Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అంతిమ లబ్దిదారు చంద్రబాబే: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్

Last Updated : Sep 10, 2023, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details