తెలంగాణ

telangana

ETV Bharat / bharat

SSC Jobs : ఎస్​ఎస్​సీ భారీ నోటిఫికేషన్​.. డిగ్రీ అర్హతతో 1876 ఎస్​ఐ​ పోస్టుల భర్తీ! - ఎస్​ఎస్​సీ సీపీఓ వయోపరిమితి

SSC Jobs : పోలీసు ఉద్యోగాలు ఆశించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. స్టాఫ్​ సెలక్షన్ కమిషన్​ 1876 సబ్​ ఇన్​స్పెక్టర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

SI JOBS
SSC CPO notification 2023

By

Published : Jul 22, 2023, 10:31 AM IST

SSC Jobs 2023 : గ్రాడ్యుయేషన్ పూర్తి​ చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​కు చెందిన సెంట్రల్​ పోలీస్ ఆర్గనైజేషన్​ 1876 సబ్​ ఇన్​స్పెక్టర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు బీఎస్​ఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, దిల్లీ పోలీస్​, సీఆర్​పీఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీల్లో పనిచేయాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు
SSC SI JOBS :

  • దిల్లీ పోలీసు డిపార్ట్​మెంట్​ - 106 పోస్టులు
  • బీఎస్​ఎఫ్​ - 113 పోస్టులు
  • సీఐఎస్​ఎఫ్​ - 630 పోస్టులు
  • సీఆర్​పీఎఫ్​ - 818 పోస్టులు
  • ఐటీబీపీ - 63 పోస్టులు
  • ఎస్​ఎస్​బీ - 90 పోస్టులు

విద్యార్హతలు

  • SSC CPO Eligibility: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పొంది ఉండాలి.
  • దిల్లీ పోలీసు డిపార్ట్​మెంట్​లో సబ్​ ఇన్​స్పెక్టర్​ పోస్టులకు మాత్రం అభ్యర్థులు కచ్చితంగా మోటార్​ సైకిల్​, కారుకు సంబంధించిన డ్రైవింగ్​ లైసెన్స్​ను కలిగి ఉండాలి.

వయోపరిమితి
SSC SI Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 20 ఏళ్లు నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు, ఎక్స్​ సర్వీస్​మెన్​కు - 3 సంవత్సరాలు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్​ను చూడండి.

దరఖాస్తు రుసుము
SSC CPO Application fee :

  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్​, మహిళలకు అప్లికేషన్​ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక విధానం
SSC CPO Selection process : అభ్యర్థులను నాలుగు దశల్లో వడపోసి ఎంపిక చేస్తారు.

  • స్టేజ్​ 1 : పేపర్​ 1 - కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​
  • స్టేజ్​ 2 : ఫిజికల్ స్టాండర్డ్​ టెస్ట్​ (పీఎస్​టీ) & ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్​ (పీఈటీ)
  • స్టేజ్​ 3 : పేపర్​ 2 - కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​
  • స్టేజ్​ 4 : మెడికల్​ ఎగ్జామినేషన్​

నోట్​ : పీఈటీ/పీఎస్​టీ టెస్ట్​లో రన్నింగ్​, లాంగ్​ జంప్​, హై జంప్​, షార్ట్​పుట్​లు ఉంటాయి. కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​లో ఆబ్జెక్టివ్​ మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలు ఉంటాయి. అలాగే ప్రతి తప్పు జవాబుకు 0.25 నెగిటివ్​ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం
SSC CPO Apply : ఆసక్తి గల అభ్యర్థులు ssc.nic.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
SSC CPO Important dates :

  • ఎస్​ఎస్​సీ సీపీఓ నోటిఫికేషన్​ విడుదల తేదీ : 2023 జులై 21
  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2023 జులై 22
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 15
  • ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 17
  • దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 16, 17
  • ఎస్​ఎస్​సీ సీపీఓ పేపర్​ 1 పరీక్ష తేదీ : 2023 అక్టోబర్​ 3 నుంచి 6 వరకు

ABOUT THE AUTHOR

...view details