తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లర్​లో యువతిపై గ్యాంగ్​రేప్​.. మేనేజర్​, కస్టమర్ కలిసి.. - Beauty Parlour Girl Gang Rape by customer

బ్యూటీపార్లర్​లో పనిచేస్తున్న ఓ యువతిపై పార్లర్​ మేనేజర్​తో పాటు కస్టమర్​ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, మహారాష్ట్రలో ఓ 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి రోడ్డు మీద పడేసి పారిపోయారు.

spa-owner-and-customer-gangraped-girl-after-consuming-intoxicants-in-delhi
spa-owner-and-customer-gangraped-girl-after-consuming-intoxicants-in-delhi

By

Published : Aug 6, 2022, 4:02 PM IST

Beauty Parlour Girl Gang Rape: దిల్లీలో దారుణం జరిగింది. బ్యూటీపార్లర్​లో (స్పా)​ విధులు నిర్వహిస్తున్న ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. పార్లర్​ మేనేజర్​తో పాటు ఓ కస్టమర్ కలసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం..కొన్నాళ్ల క్రితం బాధితురాలు.. పితాంపుర ప్రాంతంలో ఉన్న ఓషన్​ స్పాలో చేరింది. అయితే శుక్రవారం రాత్రి పార్లర్ మేనేజర్​ రాహుల్​, కస్టమర్​ సతీశ్..​ మత్తుపదార్థాలు సేవించి పార్లర్​కు వచ్చారు. ఆ సమయంలో పార్లర్​లో ఉన్న బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. వెంటనే బాధితురాలు మౌర్య ఎన్​క్లేవ్​ పోలీస్​స్టేషన్​కు కాల్​ చేసి చెప్పింది. హుటాహుటిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మేనేజర్​, కస్టమర్​ను అరెస్ట్ చేశారు. బాధితురాల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ​కేసు నమోదు చేశామని, విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

35 ఏళ్ల మహిళపై గ్యాంగ్​ రేప్.. సీఎం సీరియస్​
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం రోడ్డుపై పడేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. అయితే ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే.. సీరియస్​ అయ్యారు. సిట్‌ ద్వారా విచారణ జరిపించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details