భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఒకటైన అసోంలోని కరీంగంజ్ జిల్లాలో పోలీసులు సొరంగాన్ని కనుగొన్నారు. ఓ అపహరణ కేసులో దర్యాప్తు చేపడుతున్న క్రమంలో శుక్రవారం ఈ సొరంగం బయటపడింది. దీనిని చొరబాటుదారులు, నేరస్థులు లేదా పశువుల అక్రమ రవాణా చేసేవారు నిర్మించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
''అపహరణకు గురైన ఓ వ్యక్తిని సరిహద్దు అవతలకు తరలించారని ఇటీవలే నీలంబజార్ ఠాణాలో కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపడుతున్న క్రమంలో ఈ సొరంగం బయటపడింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది కాబట్టి.. ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేం. సరిహద్దు బలగాలకు సమాచారాన్ని అందించాం.''