Covaxin Omicron: ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్ టీకా.. ఇతర టీకాల కంటే బాగా పని చేసే అవకాశం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రవర్తన గురించి ఇప్పటివరకు పెద్దగా తెలియనప్పటికీ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల కంటే కొవాగ్జిన్ సమర్థంగా పని చేసే అవకాశం ఉందని ఐసీఎంఆర్ సీనియర్ అధికారి డాక్టర్ సమీరన్ పాండా తెలిపారు.
తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్.. గత కొవిడ్ వేరియంట్ల కంటే ఎక్కువ మ్యూటేషన్లకు గురవుతోంది. స్పైక్ ప్రొటీన్ ఆధారంగా తయారైన ఫైజర్, మోడెర్నా వంటి mRNA వ్యాక్సిన్ల కంటే కొవాగ్జిన్‌తో కలిగే రోగ నిరోధకశక్తి నుంచి ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువ అని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు.
'ఇతర టీకాల కంటే బాగా పని చేస్తుంది'
ICMR Covaxin Efficacy: ఫైజర్, మోడెర్నా వంటి mRNA టీకాలను కణం లోపల స్పైక్ ప్రోటీన్‌లో కొంతభాగాన్ని ఉత్పత్తి చేసే విధంగా రూపొందించారు. దాని ఆధారంగా వైరస్‌ను శరీరం గుర్తిస్తుంది. ఐతే ఒమిక్రాన్‌లో 50 మ్యుటేషన్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు స్పైక్ ప్రోటీన్, దాని రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌పై(ఆర్బీడీ) ఉన్నాయి. డెల్టా వేరియంట్లో ఆర్బీడీపై రెండు మ్యుటేషన్లు ఉండగా.. ఇక్కడ పది వరకు ఉన్నాయి. వైరస్ నిర్మాణం మార్పు చెందితే.. mRNA వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయన్నది ప్రశ్నార్థంగా మారినట్లు డాక్టర్ పాండా తెలిపారు. అదే కొవాగ్జిన్ విషయానికొస్తే వైరస్‌పై సమర్థంగా ప్రభావం చూపుతుందన్నారు. ఒకేసారి మూడు వేర్వేరు సంభావ్య ప్రాణాంతక ప్రదేశాలపై కొవాగ్జిన్ ప్రభావం చూపుతుందన్నారు. అయినప్పటికీ వేరియంట్లకు అనుగుణంగా సర్దుబాటుచేసే గుణం mRNA వ్యాక్సిన్లు కలిగి ఉంటాయని తెలిపారు.