తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో 'చెడ్డీ' వివాదం.. కాంగ్రెస్‌ కార్యాలయానికి నిక్కర్లు - congress rss controversy

Karnaka Congress: ఆర్‌ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే నిక్కర్లను పోగుచేసి కాంగ్రెస్‌ కార్యాలయానికి పంపుతున్నారు.

rss-sends-karnataka-congress-underwear
కర్ణాటకలో 'చెడ్డీ' వివాదం

By

Published : Jun 7, 2022, 5:14 AM IST

Siddaramaiah News: కర్ణాటకలో ఓ వింత వివాదం సాగుతోంది. అదే చెడ్డీ వివాదం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (ఆర్‌ఎస్ఎస్‌)కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే నిక్కర్లను పోగుచేసి కాంగ్రెస్‌ కార్యాలయానికి పంపుతుండటం గమనార్హం.

ఇదీ వివాదం.. విద్యను కాషాయీకరణం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్‌ ఇంటి బయట ఖాకీ నిక్కర్లను కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు పోలీసుల ఎదుట చెడ్డీలను కాల్చారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా మేం ఎక్కడైనా కాలుస్తాం’ అని పేర్కొన్నారు.

మాజీ సీఎం వ్యాఖ్యలు కాస్తా వివాదానికి దారితీశాయి. భాజపా నేత చలవాడి నారాయణస్వామి మాట్లాడుతూ.. ఆయన ఈ స్థాయికి దిగజారుతారని ఊహించలేదని పేర్కొన్నారు. ‘సిద్ధరామయ్య చెడ్డీలు కాల్చాలనుకుంటే ఆయన ఇంట్లో వాటిని కాల్చుకోనీయండి. సిద్దరామయ్యకు చడ్డీలు పంపి సహాయం చేయమని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులకు తెలియజేశాను. చడ్డీలను కాల్చడం వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలని ఆయన్ను కోరుతున్నాను. సిద్ధరామయ్య ఈ స్థాయికి దిగజారిపోతారని అనుకోలేదు’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. సిద్ధరామయ్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యాలయానికి పెద్ద ఎత్తున నిక్కర్‌ పార్సిళ్లను పంపుతున్నారు.

ఇదీ చదవండి:పెంపుడు కుక్కల పెళ్లి.. 500 మందితో భారీ ఊరేగింపు

ABOUT THE AUTHOR

...view details