తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆక్సిజన్​ సరఫరాలో రైల్వేశాఖ అరుదైన మైలురాయి

దేశంలో 'ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​' పేరిట ప్రాణవాయువును సరఫరా చేస్తున్న రైల్వేశాఖ అరుదైన మైలురాయిని అందుకుంది. గత నెల 19న తన సేవలను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 10వేల టన్నుల ఆక్సిజన్​ను పంపిణీ చేసినట్టు పేర్కొంది.

By

Published : May 17, 2021, 4:41 PM IST

Railway Board Chairman Suneet Sharma
రైల్వే బోర్డు ఛైర్మన్​ సునీత్​ శర్మ

కరోనా 2.0 ఉద్ధృతి నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు ప్రాణవాయువు సరఫరా చేస్తున్న రైల్వేశాఖ అరుదైన మైలురాయిని చేరుకుంది. సోమవారం ఉదయం నాటికి ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​ల ద్వారా 10వేల టన్నుల మెడికల్​ ఆక్సిజన్​ను సరఫరా చేసినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్​ సునీత్​ శర్మ తెలిపారు.

దేశంలో ప్రాణవాయువు కొరత తీర్చేందుకు రైల్వేల ద్వారా.. 'ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్'​ పేరిట గత ఏప్రిల్​ 19 నుంచి ఈ సేవలను ప్రారంభించింది రైల్వే. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో సేవలందిస్తోంది.

ఇటీవలి కాలంలో.. గరిష్ఠంగా సుమారు 150 టన్నుల మెడికల్​ ఆక్సిజన్​ను సరఫరా చేశామని రైల్వే శాఖ తెలిపింది. ఇది సాధారణం(రోజుకు సగటున 134 టన్నులు) కంటే ఎక్కువని పేర్కొంది.

ఇదీ చదవండి:ఆ చిన్నారులకు పునరావాసం కల్పించే దిశగా సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details