Rajasthan LPG price : పేదలకు శుభవార్త చెప్పింది రాజస్థాన్లోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి, ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. అర్హులైన కుటుంబాలకు ఏటా 12 సిలిండర్లు ఇలా తక్కువ ధరకే అందిస్తామని సీఎం అశోక్ గహ్లోత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు.
రూ.500కే వంట గ్యాస్ సిలిండర్.. వారందరికీ సీఎం వరం - rajasthan cm lpg news
LPG price cut news : పేద ప్రజలకు భారీ వరం ప్రకటించింది రాజస్థాన్ ప్రభుత్వం. వంట గ్యాస్ సిలిండర్ను రూ.500కే అందించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
"బడ్జెట్ కోసం కసరత్తులు ప్రారంభించాం. ఇప్పుడైతే నేను ఒకటే చెప్పగలను. పేద ప్రజలకు రూ.500కే సిలిండర్లు ఇస్తాం. ఉజ్వల పథకం కింద ప్రజలకు మోదీ సర్కారు ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. కానీ సిలిండర్ల ధర రూ.వెయ్యికి చేరింది. ఇప్పుడు అవన్నీ ఖాళీగా ఉన్నాయి."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం
వచ్చే ఏడాది రాజస్థాన్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కీలక ప్రకటన చేశారు సీఎం గహ్లోత్. రాష్ట్రంలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇతర విషయాలతో పోలిస్తే పార్టీలో వర్గపోరే ప్రధాన సమస్యగా మారింది.