దేశ రాజధాని దిల్లీలో మే నెలకు గాను 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా 119.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. గత 45 ఏళ్లలో మే నెలలో ఇంతటిస్థాయిలో వర్షపాతం కురవడం ఇదే తొలిసారి అని చెప్పింది.
దిల్లీలో రికార్డు స్థాయిలో వర్షపాతం
దిల్లీలో 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. గత 45 ఏళ్లలో మే నెలలో ఇంతటి స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమమని పేర్కొంది.
దిల్లీలో రికార్డు స్థాయిలో వర్షపాతం
అధిక వర్షాల కారణంగా దిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉష్ణోగ్రతలు 16 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండీ చెప్పింది. గత 70ఏళ్లలో మే నెల ఉష్ణోగ్రతలు ఇంత స్వల్పస్థాయికి చేరడమిదే తొలిసారని పేర్కొంది. తౌక్టే తుపాను ప్రభావంతో దిల్లీలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇదీ చూడండి:ముంచుకొస్తున్న మరో తుపాను- బంగాల్పై తీవ్ర ప్రభావం!