తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ గాంధీ​ 'కానుక'తో ఆ బాలుడు ఖుష్​ - తమిళనాడులోని కన్యాకుమారి

కాంగ్రెస్ అగ్రనేత​ రాహుల్ గాంధీ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నారులతో ముచ్చటించిన ఆయన.. ఈ సందర్భంగా ఓ బాలుడి కోరికను విన్నారు. అనంతరం ఆ బాలుడికి కానుకను పంపి ఆశ్చర్యపరిచారు. ఆ కానుక అందుకున్న బాలుడు ఎవరు? ఇంతకీ రాహుల్​ ఏం పంపించాడు?

Rahul Gandhi's surprise gift for a small boy
రాహుల్​ గాంధీ​ 'కానుక'తో ఆ బాలుడు ఖుష్​

By

Published : Mar 11, 2021, 9:50 AM IST

Updated : Mar 11, 2021, 10:49 AM IST

కాంగ్రెస్ సీనియర్​ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన కానుకతో ఓ బాలుడు ఆనందంలో మునిగిపోతున్నాడు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ బాలుడితో మాట్లాడిన రాహుల్​.. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని.. అతడికి రన్నింగ్​ షూస్​ను అందించారు.

ఈ నెల 1న తమిళనాడులోని కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్​. ఈ పర్యటన సందర్భంగా అక్కడి వెదురు తోటల్లో ఉన్న కొందరు బాలురు పలకరించగా.. రాహుల్ గాంధీ కారులో నుంచి దిగి వారితో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆంథోనీ ఫెలిక్స్ అనే ఆరో తరగతి బాలుడు తనకు పరుగు పందెం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు తెలిపాడు. అలాగే సరైన శిక్షణ ఇప్పిస్తే.. పోటీల్లో గెలవగలనని విశ్వాసంతో చెప్పాడు. బాలుడి మాటలు విన్న రాహుల్ గాంధీ కోచ్​ను ఏర్పాటు చేస్తానని.. రన్నింగ్ షూస్​ సైతం కొనిస్తానని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానం మేరకు ఆంథోనికి బూట్ల జత కొని పంపారు.

ఇవి అందుకున్న బాలుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆంథోనితో ఫోన్​లో మాట్లాడిన రాహుల్.. 'బూట్లు నచ్చాయా' అని అడిగారు.

ఇదీ చదవండి:కథ సుఖాంతం.. కన్నతల్లి చెంతకు గీత

Last Updated : Mar 11, 2021, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details