తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అదే అగాధంలోకి యావత్​ దేశాన్ని నెడుతున్నారు'

కేంద్రంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ. బిహార్​ ప్రజలు కనీస మద్దతు ధర లేక ఎదుర్కొంటున్న సమస్యల అగాధంలోకి యావత్​ దేశాన్ని ప్రధాని మోదీ నెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు ప్రతి పౌరుడు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

Rahul Gandhi hits out at Centre
కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ

By

Published : Dec 5, 2020, 1:01 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపడుతున్న క్రమంలో మరోమారు కేంద్రంపై విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్ర​నేత రాహుల్​ గాంధీ. కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ), వ్యవసాయ మార్కెట్​ కమిటీ(ఏపీఎంసీ)లను సూచిస్తూ ధ్వజమెత్తారు. రైతులు చేస్తోన్న ఆందోళనలకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని ట్విట్టర్​ వేదికగా పిలుపునిచ్చారు.

" ఎంఎస్​పీ-ఏపీఎంసీ లేకపోవటం వల్ల బిహార్​ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ అదే సమస్యల అగాధంలోకి యావత్​ దేశాన్ని నెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు రైతులకు మద్దతుగా నిలవాలి. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్ర నేత

కేంద్రం తీసుకొచ్చిన 3వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దిల్లీ సరిహద్దులో ఆందోళన చేపడుతున్నారు రైతులు. శనివారం ఐదో విడత చర్చలు జరపనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించి, కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు కిసాన్​ మహాపంచాయత్​ అధ్యక్షుడు రామ్​పాల్​ జట్​. శనివారం జరిగే చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాకుంటే రాజస్థాన్​కు చెందిన రైతులు ఎన్​హెచ్​-8 నుంచి దిల్లీకి ర్యాలీగా వెళ్లి జంతర్​మంతర్​ వద్ద ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంట్‌ ముట్టడే: రైతులు

ABOUT THE AUTHOR

...view details