తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ వర్షంలోనూ.. పోలింగ్ కేంద్రం వద్ద జనం బారులు

బంగాల్​లో భవానీపుర్​ ఉపఎన్నిక పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. జనం భారీ సంఖ్యలో పోలింగ్ బూత్​లకు చేరుకుంటున్నారు. ఓ వైపు వర్షం వస్తున్నా.. ఓటేసేందుకు లైన్లలోనే నిల్చున్నారు. అటు.. ఒడిశాలోనూ పిపిలీ ఉపఎన్నిక జరుగుతోంది.

Bhabanipur repolling
పోలింగ్ కేంద్రం వద్ద జనం బారులు

By

Published : Sep 30, 2021, 11:35 AM IST

Updated : Sep 30, 2021, 11:50 AM IST

బంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతోంది. భారీ సంఖ్యలో జనం పోలింగ్​లో పాల్గొన్నారు.

వర్షం వస్తున్నా.. ఓటు వేయడానికి లైన్లలో నిల్చున్నారు.

భవానీపుర్‌, జాంగీపుర్‌, సంషేర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. భవానీపుర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బంగాల్​ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది. మమతకు పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ పోటీ చేస్తున్నారు.

కరోనా నిబంధనల నడుమ బంగాల్​లో జరుగుతున్న పోలింగ్​ ప్రక్రియ
భారీ వర్షంలోనూ ఓటు వేయడానికి లైన్లలో నిల్చున్న జనం
భవానీపుర్​లో ఓటు హక్కు వినియోగించుకున్న 90 ఏళ్ల వృద్ధురాలు
పోలింగ్​ బూత్​ నెంబర్​ 71 వద్ద బారులు తీరిన జనం
ఒడిశా పూరీ, పిపిలీలో జరుగుతున్న పోలింగ్​
ఓటు హక్కు వినియోగించుకుంటున్న వ్యక్తి
Last Updated : Sep 30, 2021, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details