తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ విజృంభణ- సీఎంలతో నేడు ప్రధాని కీలక భేటీ - కరోనా

PM Narendra Modi: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు (గురువారం) భేటీ కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో కరోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చర్చించనున్నారు.

PM Narendra Modi
నరేంద్ర మోదీ

By

Published : Jan 13, 2022, 5:01 AM IST

PM Narendra Modi: ఒమిక్రాన్ కారణంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కొత్త ఆంక్షలను విధిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పరిస్థితిపై గురువారం సాయంత్రం 4.30 గంటలకు సీఎంతో మోదీ కీలక సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.

ఆదివారం (జనవరి 9) జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలోనూ కొవిడ్‌ పరిస్థితిపై మోదీ చర్చించారు. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని సూచించారు. కరోనాను నిలువరించేందుకు టీకానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.

Corona cases in India: భారత్​లో బుధవారం కొత్తగా 1,94,720 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 442 మంది మరణించారు. 60,405 మంది వైరస్​ను జయించారు. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఒమిక్రాన్​ను కట్టడి చేసేందుకు దేశంలోని ఆరోగ్యకర్తలు, 60ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్​ డోసు పంపిణీని ఇప్పటికే ప్రారంభించింది కేంద్రం. 15-18 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు అందిస్తోంది. 2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు ప్రధాని. వైరస్​ కట్టడికి చర్యలపై చర్చిస్తున్నారు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే 45 వేలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details