దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి(Covid new variant) నేపథ్యంలో.. అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'కు(Omicron variant) తీవ్రంగా వ్యాపించే లక్షణాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో భారత్‌లో కరోనా పరిస్థితులు(India covid cases), వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ వ్యాప్తి, వివిధ దేశాల్లోని పరిస్థితులపై మోదీకి అధికారులు వివరించారు. భారత్‌పై ఈ వేరియంట్ ప్రభావం ఎలా ఉండొచ్చని చర్చించారు.
కొత్త వేరియంట్ వ్యాప్తి కట్టడికి(Omicron variant india) తగిన చర్యలు చేపట్టాలని అధికారులను మోదీ ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పర్యవేక్షించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం వారికి పరీక్షలు చేయాలన్నారు. ప్రజలంతా మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్(హెల్త్) సభ్యుడు వీకేపాల్ సహా తదితరులు పాల్గొన్నారు.
చర్యలు షురూ..