తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిజర్వేషన్​ పోరు-చెన్నైలో ఉద్రిక్తత - వన్నియార్​ సామాజిక వర్గం నిరసనలు

తమిళనాడులో రిజర్వేషన్ల కోసం ఓ పార్టీ కార్యకర్తలు చేసిన నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. వన్నియార్​ సామాజిక వర్గానికి రిజర్వేషన్​ కల్పించాలని పట్టాలి మక్కల్​ కట్చి పార్టీ చెన్నైలో ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు రోడ్ల మీదుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా.. ఆందోళనకారులు రెచ్చిపోయారు.

Paattali Makkal Katchi workers pelt stones at a train and block road in Perungalathur after being stopped by police
రిజర్వేషన్​ పోరు-చెన్నైలో ఉద్రిక్తత

By

Published : Dec 1, 2020, 12:07 PM IST

రిజర్వేషన్ల కోసం నిరసన తెలిపేందుకు వెళ్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడం తమిళనాడులో ఉద్రిక్తతలకు దారితీసింది. వన్నియార్ సామాజికవర్గానికి 20శాతం రిజర్వేషన్ కల్పించాంటూ పట్టాలి మక్కల్ కట్చి పార్టీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ చెన్నైలో నిరసనలకు పిలుపునిచ్చింది.

ట్రాక్​పై ఉండి రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు
రోడ్డు పై నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు
రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు

అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం ఆందోళనలకు దారితీసింది. చెన్నై వెళ్తున్న వాహనాలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం వల్ల పట్టాలి మక్కల్ కట్చి కార్యకర్తలు ఆగ్రహించారు. రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మరి కొంతమంది సమీపంలో వెళ్తున్న రైలుపై రాళ్లురువ్వడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.

ఇదీ చూడండి: తమిళనాడుకు మరో తుపాను ముప్పు

ABOUT THE AUTHOR

...view details