తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 9:10 AM IST

ETV Bharat / bharat

'కరోనా వేళ 35 లక్షల మంది పుణ్యస్నానాలు'

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో జరుగుతున్న కుంభమేళాలో భాగంగా సోమవారం 35 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ.. రెండోషాహీ స్నాన్ సందర్భంగా వేలాది మంది సాధువులు, నాగాలు పుణ్నస్నానాలు చేసినట్లు పేర్కొంది.

Over 35 lakhs take dip in Ganga on shahi snan amid rising coronavirus cases
'కుంభమేళాలో 35 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు'

దేశంలో కరోనా విజృంభిస్తున్నా.. ఉత్తరాఖండ్ హరిద్వార్​లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. రెండోషాహీ స్నాన్ సందర్భంగా సాయంత్రం 6 గంటల వరకు 35 లక్షల మందికి పేగా భక్తులు పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం వేలాది మంది సాధువులు, నాగాలు పుణ్నస్నానాలు చేశారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా వారిపై పూలవర్షం కురిపించింది. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు, నాగాలు భారీ ఊరేగింపుగా వచ్చి పుణ్యస్నానాలు చేశారు. సాధువుల రాకతో హర్‌ కి పైరీ ఘాట్‌ హరహర మహాదేవ్‌ నామస్మరణతో మారుమోగింది.

నేపాల్ మాజీ రాజు పుణ్య స్నానం

అత్యంత పవిత్రంగా భావించే హర్‌ కి పైరీ ఘాట్ ను ఉదయం 7 గంటల నుంచి అఖాడాలకు కేటాయించగా సాధారణ భక్తులు ఇతర ఘాట్లలో పుణ్యస్నానాలు చేశారు. మొతం 13 అఖాడాలు ఉండగా నిరంజనీ అఖాడాకు చెందిన సాధువులు మొదట షాహీస్నాన్ చేశారు. తొలిసారి హరిద్వార్‌ను సందర్శించిన నేపాల్‌ మాజీ రాజు జ్ఞానేంద్ర బీర్‌ బిక్రం షా కూడా గంగానదిలో స్నానం ఆచరించారు. హరిద్వార్‌ నుంచి దేవ్‌ ప్రయాగ్‌ వరకూ షాహీస్నాన్‌ సజావుగా సాగుతున్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ తెలిపారు.

కుంభమేళాలో లక్షల సంఖ్యలో పాల్గొన్న భక్తులు
గంగానదిలో భక్తుల పుణ్యస్నానాలు

తొలి షాహీ స్నాన్‌ గతనెల 11న మహాశివరాత్రి సందర్భంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కుంభమేళాను నెల రోజులకు కుదించారు. 600 హెక్టార్ల పొడవున సాగుతున్న కుంభమేళాకు 20 వేల మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి :15 నుంచి అమర్​నాథ్​ యాత్రకు పేర్ల నమోదు

ABOUT THE AUTHOR

...view details