తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడో దశ వ్యాక్సినేషన్​ కోసం 2.45 కోట్ల రిజిస్ట్రేషన్లు - మూడో దశ కరోనా వ్యాక్సినేషన్​

మే 1 నుంచి 18 ఏళ్లుపైబడిన వారికి కొవిడ్​ టీకా పంపిణీ కార్యక్రమం మొదలవనున్న నేపథ్యంలో.. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య భారీగా నమోదైంది. 2.45 కోట్లకు పైగా మంది లబ్ధిదారులు.. టీకా కోసం కొవిన్​ డిజిటల్​ వేదిక ద్వారా రిజిస్టర్​ చేసుకున్నారని ​కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు.. దేశవ్యాప్తంగా 15.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.

vaccination
మూడో దశ వ్యాక్సినేషన్

By

Published : Apr 30, 2021, 3:59 PM IST

మూడో దశ వ్యాక్సినేషన్​లో భాగంగా.. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్​ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు లబ్ధిదారులు పోటెత్తారు. కొవిన్​ డిజిటల్​ వేదిక ద్వారా 2.45 కోట్లకు పైగా మంది.. టీకా కోసం రిజిస్టర్​ చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్​ 28న 1.37 కోట్లకు పైగా మంది రిజిస్టర్​ చేసుకోగా.. ఏప్రిల్​ 29న 1.04 కోట్ల మంది రిజిస్టర్​ చేసుకున్నారని చెప్పింది. మరోవైపు... ఇప్పటివరకు 15.22 కోట్లు టీకా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

వ్యాక్సినేషన్​ లెక్కలు ఇలా..

  • శుక్రవారం ఉదయం 7 గంటల వరకు 22,43,097 సెషన్ల ద్వారా మొత్తం 15,22,45,179 టీకా డోసులు పంపిణీ చేశారు.
  • గురువారం కొత్తగా 22,24,548 లక్షల టీకా డోసులు పంపిణీ చేశారు.
  • 93,86,094 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోసు తీసుకోగా.. 61,91,118 మంది రెండో డోసు తీసుకున్నారు.
  • 1,24,19,965 మంది ఫ్రంట్​ లైన్​ వర్కర్స్​ కరోనా టీకా మొదటి డోసు తీసుకన్నారు. 67,07,862 మంది రెండో డోసు తీసుకున్నారు.
  • 60 ఏళ్లు పైబడినవారిలో 5,19,01,218 మంది.. టీకా మొదటి డోసు తీసుకోగా.. 1,04,41,359 రెండో డోసు తీసుకున్నారు.
  • 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో 5,17,78,842 మందికి టీకా మొదటి డోసు అందించగా.. 34,17,911 మంది.. రెండో డోసు తీసుకున్నారు.
  • మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల్లో మహారాష్ట్ర, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​, గుజరాత్​, బంగాల్​, కర్ణాటక, మధ్య ప్రదేశ్​, కేరళ, బిహార్​, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో 67.08 శాతం టీకా పంపిణీ జరిగింది.

ABOUT THE AUTHOR

...view details