తెలంగాణ

telangana

వీగిపోయిన అవిశ్వాస తీర్మానం- ఖట్టర్​ సర్కార్​ సేఫ్​

By

Published : Mar 10, 2021, 10:57 AM IST

Updated : Mar 10, 2021, 5:26 PM IST

Haryana assembly has taken up a no-confidence motion against the BJP-JJP government on the first day of the budget session. BJP, JJP and Congress issued a whip to its party MLAs for their compulsory presence in the House.

no-confidence-motion-bjp-jjp-congress-issue-whip-to-mlas
హరియాణాలో ఖట్టర్​ సర్కార్​పై అవిశ్వాస తీర్మానం

17:16 March 10

వీగిపోయిన అవిశ్వాస తీర్మానం..

హరియాణా ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ సర్కార్​ తన బలాన్ని నిరూపించుకుంది. హరియాణా అసెంబ్లీలో ప్రస్తుతం 88 సభ్యులుండగా.. ప్రభుత్వానికి అనుకూలంగా 55 మంది ఎమ్మెల్యేల ఓటు వేశారు. వ్యతిరేకంగా కేవలం 32 ఓట్లు వచ్చాయి. ఓటింగ్​ అనంతరం అవిశ్వాసం వీగిపోయినట్లు స్పీకర్​ ప్రకటించారు. 

హరియాణా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బీఎస్​ హుడా.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇటీవల ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు అధికార పార్టీకీ మద్దతు ఉపసంహరించడం వల్ల భాజపా మెజార్టీ పడిపోయిందని కాంగ్రెస్​ వాదించింది. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్ ముందునుంచి​ చెప్పినట్లుగానే తమ బలాన్ని నిరూపించుకున్నారు. 

11:26 March 10

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్ష నేత

హరియాణా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బీఎస్​ హుడా.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. "సరిహద్దులో 250కిపైగా మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారి పేర్లను నేను సమర్పించాను. కానీ, పత్రికల్లో మాత్రం రాలేదు." అని బీఎస్​ హుడా అన్నారు. 

10:58 March 10

సీఎం ధీమా..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ ధీమా వ్యక్తం చేశారు. 

హరియాణాలో మొత్తం అసెంబ్లీలో 90 స్థానాలకు గాను.. ప్రస్తుతం 88 మంది సభ్యులు ఉన్నారు. అధికార భాజపా(40) -జేజేపీ(10) కూటమికి 50 మంది సభ్యులు ఉన్నారు.  కాంగ్రెస్​కు​ 30 మంది సభ్యులు ఉన్నారు. మరో ఏడుగురు స్వతంత్రులు కాగా.. వారిలో ఐదుగురు ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. హరియాణా లోఖిత్​ పార్టీకీ చెందిన మరో ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. 

10:34 March 10

హరియాణాలో ఖట్టర్​ సర్కార్​పై అవిశ్వాస తీర్మానం

హరియాణాలో భాజాపా-జేజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్​.. అవిశ్వాస తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టింది. ఇటీవల ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు అధికార పార్టీకీ మద్దతు ఉపసంహరించడం వల్ల భాజపా మెజార్టీ పడిపోయిందని కాంగ్రెస్​ వాదిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్​ జ్ఞాన్​చంద్​ గుప్తా ఆమోదించారు.  

ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న బలపరీక్షకు భాజపా సహా కాంగ్రెస్​ తమ సభ్యులకు విప్​ జారీ చేశారు. తప్పనిసరిగా సభకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సభ నుంచి బయటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశాయి. 

Last Updated : Mar 10, 2021, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details