Molestation In RTC Bus: కేరళ ఆర్టీసీ బస్‌లో ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని ఓ ఉపాధ్యాయురాలు ఆరోపించారు. దీనిపై కండక్టర్‌కు ఫిర్యాదు చేస్తే అతను ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
తిరువనంతపురం నుంచి బస్సు త్రిసూర్ వెళ్తుండగా సహ ప్రయాణికుడు తనను లైంగికంగా వేధించనట్లు మహిళ పేర్కొన్నారు. ఈ సమయంలో తాను నిద్రిపోతున్నట్లు తెలిపారు. నిందితుడు ఆమెతో పాటే తిరువనంతపురంలో బస్ ఎక్కాడు. అయితే కోజికోడ్ నుంచి బస్ త్రిసూర్‌కు చేరుతున్న సమయంలో వెనక నుంచి తన శరీర భాగాలను తాకేందుకు ప్రయత్నించినట్లు మహిళ ఆరోపించారు. అయితే తాను అందుకు ఎదురు చెప్పడం వల్ల ఆగిపోయినట్లు వివరించారు.
అయితే కండక్టర్ ఈ విషయంపై తగిన రీతిలో స్పందించకుండా.. తేలిగ్గా తీసుకున్నట్లు మహిళ ఆరోపించారు. కేవలం నిందితుడు క్షమాపణ కోరాడని.. తనని వారించినట్లు తెలిపారు.
మంత్రి స్పందన