తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోకల్​ ట్రైన్​పై నిరసనకారుల రాళ్ల దాడి.. పలువురికి గాయాలు - రైలుపై నిరసనకారులు దాడి

Mob attacks train: భాజపా నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బంగాల్​లోని ఓ రైల్వే స్టేషన్​లో లోకల్​ ట్రైన్​ను ధ్వంసం చేశారు నిరసనకారులు. పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Mob attacks train
నిరసనకారులు

By

Published : Jun 12, 2022, 10:44 PM IST

Mob attacks train: భాజపా నేతలు నుపుర్​ శర్మ, నవీన్​ జిందాల్​ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. బంగాల్​లో తాజాగా లోకల్​ ట్రైన్​పై రాళ్ల దాడి చేశారు నిరసనకారులు. రాళ్ల దాడిలో పలు బోగీలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. నాదియా జిల్లాలోని బెతువదాహరి రైల్వే స్టేషన్​లో ఘటన జరిగింది. సుమారు 1000 మందికిపైగా ఆందోళన కారులు లోకల్ రైలుపై.. రాళ్ల దాడికి పాల్పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.

నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు

అసలేం జరిగిదంటే: పెద్ద సంఖ్యలో నిరసనకారులు రోడ్డు దిగ్భందించారు. వారిని నిలువరించేందుకు పోలీసులు వెళ్లగా.. కొందరు నిరసనకారులు బెతువదాహరి రైల్వే స్టేషన్​లోకి ప్రవేశించారు. అక్కడ ఫ్లాట్​ఫాంపై ఉన్న లోకల్ రైలుపై రాళ్లు రువ్వారు. ఈ దాడి కారణంగా లాల్గోనా లైన్​లో రైలు సేవలు నిలిచిపోయినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే సేవల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి ఉన్నామని అధికారులు తెలిపారు.

దాడిలో ధ్వంసం అయిన రైలు
గుంపుగా రైల్వే స్టేషన్​లోకి వెళ్తున్న నిరసనకారులు

ABOUT THE AUTHOR

...view details