Minorities Votes Impact in Telangana Elections 2023 :శాసనసభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో మైనార్టీల ఓటుబ్యాంకుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. భారత రాష్ట్ర సమితితోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ మైనార్టీ ఓటుబ్యాంకుపై ప్రధానంగా దృష్టి సారించాయి. రాష్ట్రంలో మైనార్టీల శాతం 14వరకు ఉంది. అందులో 12.7 శాతం ముస్లింలు ఉండగా... మిగతా క్రిస్టియన్లు, ఇతరులు ఉన్నారు. ఆయా సామాజిక వర్గాల ఓట్లను రాబట్టుకునే పనిలో రాజకీయ పార్టీలు పడ్డాయి.
రాష్ట్రంలోని మూడో వంతు నియోజకవర్గాల్లో ముస్లింలు నిర్ణయాత్మక సంఖ్యలో ఉన్నారు. 40 నుంచి 45 నియోజకవర్గాల్లో వారి సంఖ్య పదివేలకుపైగానే ఉంది. ఏడు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య 50 నుంచి 90 శాతం వరకు ఉంటుంది. 22 నియోజకవర్గాల్లో 15 నుంచి శాతం వరకు... 13 నియోజకవర్గాల్లో పది నుంచి 15 శాతం వరకు ముస్లిం ఓట్లు ఉంటాయి.
Minorities Votes in Telangana 2023 :42 నియోజకవర్గాల్లో ఐదు నుంచి పది శాతం వరకు... మిగిలిన 35 నియోజకవర్గాల్లో రెండు నుంచి శాతం వరకు ముస్లిం ఓట్లు ఉంటాయి. ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్నాయి. నగరంలోని 15 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ముస్లిం మైనార్టీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు ముస్లింలవే. సహజంగా ఆ నియోజకవర్గాల్లో వారు మజ్లిస్ వైపే ఉండనున్నారు.
బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్ షా
నాంపల్లిలో కాంగ్రెస్ బలమైన మైనార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌ను బరిలో నిలపడంతో పోరు ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్‌లోనూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను పోటీలో నిలిపింది. అటు మజ్లిస్ కూడా ఈమారు జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థిని బరిలో దింపింది. నగరంలో మిగిలిన గోషామహల్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్, అంబర్‌పేట్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓట్లు అధికంగా ఉంటాయి. సికింద్రాబాద్‌తో పాటు సనత్‌నగర్, కంటోన్మెంట్, ఉప్పల్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో క్రిస్టియన్లు ఉంటారు.ఉమ్మడి జిల్లా కేంద్రాలైన కరీంనగర్, వరంగల్ ఈస్ట్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ అర్బన్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు.
Telangana Assembly Elections 2023 :ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఈ సామాజిక వర్గం వారు ఉంటారు. వీటితోపాటు హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్, మహేశ్వరం, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి తదితర నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్ల సంఖ్య బాగానే ఉంటుంది. ముథోల్, నిర్మల్, జగిత్యాల, రామగుండం, బోధన్, కామారెడ్డి, బాన్స్‌వాడ, జహీరాబాద్, తాండూరు, గద్వాల, జడ్చర్ల నియోజకవర్గాల్లోనూ నిర్ణయాత్మకంగానే ముస్లిం ఓటర్లు ఉంటారు. ఖానాపూర్, కోరుట్ల, వికారాబాద్, పరిగి, కొడంగల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, భువనగిరి, దేవరకొండ, కొత్తగూడెం, ఎల్లారెడ్డిలోనూ ముస్లిం ఓట్లు కీలకమే.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెబల్స్ టెన్షన్ - పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల పాట్లు