తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2023, 9:05 AM IST

ETV Bharat / bharat

"తప్పుడు కేసులతో మార్గదర్శిపై ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది"

Intellectuals: వైసీపీ ప్రభుత్వం ఈనాడుపై కక్షతోనే కావాలనే రామోజీరావుకు సంబంధించిన సంస్థలపై తప్పుడు కేసులతో వేధిస్తోందని పలువురు మేధావులు అన్నారు. ఇందులో భాగంగా మార్గదర్శి సంస్థపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నందిగామలో ఏర్పాటు చేసిన సమావేశంలో తప్పుబట్టారు. మార్గదర్శి సంస్థకు ఉన్న ప్రజల ఆదరణను తగ్గించటానికి ప్రభుత్వం సంస్థపై తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించారు.

Etv Bharat
Etv Bharat

ఈనాడుపై కక్షతోనే మార్గదర్శిపై దాడులన్న వక్తలు

Intellectuals Round Table Meeting: ఈనాడుపై కక్షతోనే మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేస్తోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. 60 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న సంస్థపై కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో మాజీ సైనికోద్యోగుల సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్​ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు, మాజీ సైనికులు ఎల్‌.కోటేశ్వరరావు, ఎమ్‌.కోటేశ్వరరావుతో పాటు పలువురు రిటైర్డ్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎవరూ ఎక్కడా ఫిర్యాదు చేయకున్నా మార్గదర్శిపై కేసులు పెడుతున్నారంటూ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఏ ఒక్క ఖాతాదారుడు కూడా ఇంతవరకు సంస్థ తమ నగుదు తమకు తిరిగి ఇవ్వటం లేదని ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. మార్గదర్శి సంస్థకు ఉన్న ప్రజల ఆదరణను తగ్గించటానికి ప్రభుత్వం సంస్థపై తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించారు.

రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో పకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రామోజీరావు వారి సంస్థల ద్వారా సహాయం అదించారని తెలిపారు. వరదలు సంభవించినపుడు ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించారని తెలిపారు. అలాంటి వ్యక్తిపైన తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతోందని తప్పుబట్టారు.

"తుఫానులు వచ్చి ఇళ్లు మునిగి, కూలిపోయిన నిరాశ్రయులకు రామోజీరావు వారి సంస్థల ద్వారా అనేక మందికి ఇళ్లు కట్టించారు. చాలా మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై, సంస్థలపై జగన్​ మోహన్​ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది." -వాసిరెడ్డి ప్రసాద్​, మాజీ సైనికోద్యోగుల సంఘం అధ్యక్షుడు

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఆయన కొన్ని కోట్ల రూపాయల సహాయాన్ని అందిస్తున్నారు. అలాంటి వ్యక్తిపైన పెట్టినవన్నీ తప్పుడు కేసులు. ఆ కేసులపై సెక్షన్లు చెల్లవని హైకోర్టు న్యాయవాదులు అంటున్నారు." -యర్రంరెడ్డి బాబురావు, సీనియర్‌ న్యాయవాది, నందిగామ

''నేను 25 సంవత్సరాలు మార్గదర్శిలో నగదు జమ చేసుకుంటున్నాను. నాకు ఇంతవరకు ఎప్పుడు కూడా సమస్య ఎదురు కాలేదు. మనం చెల్లించవలసిన డబ్బుల వివరాలు మనకు ఫోన్​లో మేసేజ్​ వస్తుంది. నగదు చెల్లించగానే చెల్లించినట్లు కూడా మేసేజ్​ వస్తుంది. గత 60 సంవత్సరాలు ఎటువంటి రిమార్కులు లేకుండా నడుస్తున్న సంస్థ మార్గదర్శి.'' -వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్​, విశ్రాంత ప్రిన్సిపల్, కేవీఆర్‌ కళాశాల, నందిగామ

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details