తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2021, 6:40 AM IST

ETV Bharat / bharat

కేంద్రంతో రైతుల 'కుస్తీ' మే సవాల్​

సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. నూతన చట్టాల్ని రద్దు చేయకుంటే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగా జనాల్ని ఇంకా పోగుచేయడానికి దిల్లీ సరిహద్దులో కుస్తీ పోటీలను నిర్వహించారు.

Massive crowd gathered to watch dangal for farmers protest at Ghazipur border
కేంద్రంతో 'కుస్తీ' మే సవాల్​

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళనలు 47 రోజుకు చేరుకున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసే వరకు ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. రోజుకో రీతిలో రైతులు వినూత్నంగా తమ నిరసన తెలుపుతున్నారు. ఈనేపథ్యంలో జనాలను ఇంకా పోగుచేయడానికి గాజీపూర్ సరిహద్దులో కుస్తీ పోటీలు నిర్వహించారు రైతులు.

దిల్లీ సరిహద్దులో కుస్తీ పోటీలు

కుస్తీ పోటీలను చూడడానికి మారుమూల ప్రాంతాలనుంచి చాలా మంది అక్కడికి చేరుకున్నారు. పోటీలను భారతీయ కిసాన్​ యూనియన్​ జాతీయ అధ్యక్షుడు నరేశ్​ టికౌత్​ సందర్శించారు.​ సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం సరైన అవగాహనతో లేదని విమర్శించారు టికౌత్​.

రైతులు నిర్వహిస్తున్న కుస్తీ పోటీల్లో వారి కుటుంబ సభ్యలే ఉన్నారని అన్నారు. ఒకసారి ఇక్కడ జరుగుతున్న కుస్తీ పోటీలను చూడండి రైతులు చేస్తోన్న ఆందోళనలు నిజమైనవో కావో అని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

రైతు ధర్నా ప్రదేశంలో కుస్తీ పోటీలు
కుస్తీ పడుతున్న యువకులు
కుస్తీలు చూడడానికి వచ్చిన జనం

ఇదీ చూడండి:'జాన్సన్​ పర్యటన రద్దు మా విజయమే'

ABOUT THE AUTHOR

...view details