నందిగ్రామ్‌లో భాజపా నేత సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ బంగాల్ సీఎం మమతా బెనర్జీ నమోదు చేసిన కేసు విచారణ నుంచి జస్టిస్ కౌషిక్ చందా తప్పుకున్నారు. న్యాయ వ్యవస్థపై దురుద్దేశాన్ని ఆపాదించినందుకు మమతకు రూ.5లక్షల జరిమానాను విధించారు.
ఇదీ జరిగింది..
నందిగ్రామ్‌లో భాజపా నేత సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ కౌషిక్ చందా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ చందాకు భాజపాతో సంబంధాలు ఉన్నాయని మమత ఆరోపించారు. నందిగ్రామ్ పిటిషన్‌ను ఇతర బెంచ్‌కు బదిలీ చేయాలని కోరారు. విచారణ నుంచి జస్టిస్ కౌషిక్ చందాను తప్పించాలని జూన్ 18న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మమత తరపు న్యాయవాది లేఖ రాశారు.