తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కార్యకర్తలు సంయమనం పాటించాలి: దీదీ - mamata benerjee

నందిగ్రామ్‌లో జరిగిన దాడి విషయంలో పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పశ్చిమబంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోరారు. కొన్నిరోజులపాటు చక్రాల కుర్చీలో తిరుగాడాల్సి ఉంటుందని అందుకు కార్యకర్తల సహకారం కావాలన్నారు దీదీ. ఈ మేరకు ఆస్పత్రి నుంచి ఓ వీడియో సందేశం పంపారు.

MAMATA requests everybody to maintain peace
ఎవరూ గొడవలు చేయొద్దు.. ఆస్పత్రి నుంచి మమత

By

Published : Mar 11, 2021, 3:28 PM IST

Updated : Mar 11, 2021, 3:39 PM IST

నందిగ్రామ్‌లో తనపై దాడి జరిగిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పశ్చిమబంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ప్రజలకు అసౌకర్యం కలిగే ఎలాంటి కార్యక్రమాలు చేయరాదని సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీదీ.. ఈ మేరకు ఓ వీడియో సందేశం పంపారు.

ఆస్పత్రి నుంచి మమత వీడియో సందేశం

"శాంతియుతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని కోరుతున్నా. నిన్న కారు వద్ద నిల్చుని ఉన్నప్పుడు నన్ను తోశారు. నా చేయి, కాలు, మోకాలికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్య చికిత్స కొనసాగుతోంది. 2-3 రోజుల్లో విధులకు హాజరవుతా. త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. అవసరమైతే వీల్‌చైర్‌పైనే ప్రచారం చేస్తా"

- మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం

బుధవారం నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన ఆమెపై దాడి జరిగింది. ఈ ఘటనలో మమత కాలికి గాయమైంది. రెండుమూడు రోజుల్లో ప్రచారంలో పాల్గొంటానన్నారు. కాలి గాయం సమస్యే అయినప్పటికీ ప్రచార సభలపై ఆ ప్రభావం ఉండబోదన్నారు.

కొన్నిరోజులపాటు చక్రాల కుర్చీలో తిరుగాడాల్సి ఉంటుందన్న మమత..అందుకు కార్యకర్తల సహకారం కావాలని వీడియో సందేశంలో కోరారు.

ఇదీ చూడండి:మమతకు గాయం: కుట్రా? నాటకమా?

Last Updated : Mar 11, 2021, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details