తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాగ్​పుర్​లో లాక్​డౌన్- వారికి పోలీసుల హెచ్చరిక - నాగ్​పుర్​లో మళ్లీ లాక్​డౌౌన్

మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో​ సోమవారం లాక్​డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

lockdown
నేటి నుంచి నాగ్​పూర్​లో లాక్​డౌన్​

By

Published : Mar 15, 2021, 12:31 PM IST

కరోనా విజృంభణ దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్​పూర్​లో లాక్​డౌన్​ విధించింది. వారం రోజుల పాటు అమలులో ఉండే ఈ లాక్​డౌన్​ సోమవారం ప్రారంభమైంది. ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూసేందుకు పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం

'నగర వ్యాప్తంగా గస్తీ​ నిర్వహిస్తాం. ఎవరైనా అనవసరంగా బయటకు వచ్చినా, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని కమిషనర్ అమితేష్ కుమార్ హెచ్చరించారు.

నిర్లక్ష్యం..

లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా పలు చోట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సోమవారం ఉదయం స్థానికులు యధావిధిగా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు.

పలు ప్రాంతాల్లో యధావిధిగా రోడ్ల పైకి వస్తున్న స్థానికులు
పలు ప్రాంతాల్లో యధావిధిగా రోడ్ల పైకి వస్తున్న స్థానికులు

మధ్యప్రదేశ్​లో..

ఇటీవల కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్.. సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్

నైట్​ కర్ఫ్యూపై సహా పలు ఆంక్షలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశానని చౌహాన్ అన్నారు. ఈ విషయంపై చర్చించడానికి సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :వైరస్​ విజృంభణ- ఔరంగాబాద్​లోనూ వారాంతాల్లో లాక్​డౌన్​

ABOUT THE AUTHOR

...view details