తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2022, 1:30 PM IST

ETV Bharat / bharat

ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్​.. ఇదే తొలిసారి!

Maha Governor Koshyari: మహారాష్ట్ర విధానసభలో గురువారం గందరగోళం నెలకొంది. బడ్జెట్​ సెషన్​కు ముందు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయారు గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ. అనంతరం.. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి.

Maha Governor Koshyari
Maha Governor Koshyari

Maha Governor Koshyari: మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఊహించని సంఘటనలు జరిగాయి. బడ్జెట్​ సెషన్​కు ముందు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ.. మధ్యలోనే ముగించారు. చట్టసభ్యుల నినాదాల నడుమ ఆయన విధాన్​ భవన్​ సెంట్రల్​ హాల్​ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఇదీ జరిగింది..

గవర్నర్​ సెంట్రల్​ హాల్​లోకి రాగానే.. మహా వికాస్​ అఘాడీ చట్టసభ్యులు కోశ్యారీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో విపక్ష భాజపా.. అధికార పక్షంపై విమర్శలకు దిగింది. దావూద్​ ఇబ్రహీం మనీలాండరింగ్​ కేసులో.. ఇటీవల అరెస్టైన ఎన్​సీపీ నేత, రాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్​ చేసింది.

దీంతో ఇరువర్గాల వాగ్వాదం నడుమ.. గవర్నర్​ వెళ్లిపోయారని చెప్పారు మహారాష్ట్ర ఎన్​సీపీ అధ్యక్షుడు జయంత్​ పాటిల్​. జాతీయ గీతం కోసం వేచిచూడకుండా వెళ్లారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

అదే కారణం!

గవర్నర్​ ఇటీవల ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రసంగిస్తున్న సమయంలో కోశ్యారీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అధికార కూటమి నేతలు. ​

దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్​, పద్మభూషణ్​ గ్రహీత, వ్యాపారవేత్త రాహుల్​ బజాజ్​ మృతికి సంతాప తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే ఉభయ సభలు మార్చి 4కు వాయిదాపడ్డాయి.

అనంతరం.. మహా వికాస్​ అఘాడీ నేతలు సెంట్రల్​ హాల్​ బయట గవర్నర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్​సీపీ ఎమ్మెల్యే సంజయ్​ దౌండ్​ శీర్షాసనం వేసి నిరసన తెలిపారు.

ఇవీ చూడండి:బంగాల్ స్థానికంలో టీఎంసీ హవా.. ఖాతా తెరవని భాజపా

ప్రైవేటు ట్యూషన్లు చెప్పే ప్రభుత్వ టీచర్లకు హైకోర్టు షాక్

ABOUT THE AUTHOR

...view details