తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చర్చలతోనే వివాదాలకు పరిష్కారం' - భారత్- చైనా సైనిక ప్రతిష్టంభణ

వారసత్వ అంశాలు, దేశాల మధ్య నెలకొన్న విభేదాలు చర్చలతోనే పరిష్కరించుకోవాలని భారత ఆర్మీ చీఫ్​ ఎంఎం​ నరవాణే స్పష్టం చేశారు. కానీ, ఏకపక్ష నిర్ణయాలతో కాదని తెలిపారు. భారత్​-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనను ఉద్దేశంచి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

naravane
నరవణె

By

Published : Apr 19, 2021, 9:33 PM IST

తూర్పు లద్ధాఖ్​లో భారత్​-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సైన్యాధినేత ఎంఎం నరవాణే. వారసత్వ అంశాలు, దేశాల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలను చర్చలతోనే పరిష్కరించుకోవాలి కానీ.. ఏకపక్ష నిర్ణయాలతో కాదని స్పష్టం చేశారు. ఇరు దేశాల సమ్మతితోనే విభేదాలను పరిష్కరించవచ్చునన్నారు. బలగాల ఉపసంహరణపై చైనా సానుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

ఇటీవల జరిగిన 11వ భారత్​-చైనా సైనిక చర్చలను ప్రస్తావించారు జైశంకర్​. మిగతా సరిహద్దుల్లోనూ వివాదాలు సైతం త్వరలో పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతేడాది ఏప్రిల్ నుంచి సరిహద్దులో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. మే 5న పాంగాంగ్ సరస్సు సమీపంలో జరిగిన హింసాత్మక ఘటన.. పరిస్థితులను మరింత జఠిలం చేసింది. ఇరుపక్షాలు వేలకొద్ది బలగాలను మోహరించాయి. పలు విడతలుగా జరిగిన సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా.. ఫిబ్రవరిలో ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించాయి.

ఇదీ చదవండి :మహారాష్ట్రలో మరో 59వేల కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details