తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తేజస్వీ వల్లే అర్జేడీ ఇలా ఉంది - లాలూ - tejashwi yadav latest news

ఆర్​జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్​ యాదవ్(lalu yadav news bihar)​.. తేజస్వీ యాదవ్​ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు(lalu yadav news today). తన గైర్హాజరులో పార్టీని తేజస్వీ సమర్థవంతంగా నడిపించారని కొనియాడారు. తేజస్వీ తన అంచనాలకు మించి ఎదిగారని ప్రశంసించారు(tejashwi yadav latest news). రాష్ట్రంలో ఎన్​డీఏ మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, తాను కూటమిని నిమజ్జనం చేస్తానని వ్యాఖ్యానించారు.

lalu yadav news
లాలు ప్రసాద్​ యాదవ్​

By

Published : Oct 26, 2021, 12:19 PM IST

తన చిన్నకుమారుడు తేజస్వీ యాదవ్​పై ప్రశంసల వర్షం కురిపించారు ఆర్​జేడీ అధినేత లాలు ప్రసాద్​ యాదవ్(lalu yadav news today)​. తేజస్వీ యాదవ్​ నాయకత్వంపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు(tejashwi yadav latest news). తాను లెనప్పుడు, పార్టీని(rjd news) తేజస్వీ యాదవ్​ ఎంతో సమర్థవంతంగా నడిపించారని కొనియాడారు. పార్టీ నాయకత్వంపై సోదరులు తేజస్వీ- తేజ్​ప్రతాప్​ల మధ్య విభేదాలున్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో లాలూ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"నేను లేనప్పుడు పార్టీని తేజస్వీ ఎంతో సమర్థవంతంగా నడిపించాడు. నా అంచనాలకు మించి పనిచేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. నా కుమారుడితో పాటు ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో శ్రమించడం వల్లే ఆర్​జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాస్తవానికి ఈరోజు ఆర్​జేడీ అధికారంలో ఉండేది. కానీ ఎన్​డీఏ కూటమి మోసం చేసి అధికారాన్ని చేపట్టింది."

-- లాలూ ప్రసాద్​ యాదవ్​, ఆర్​జేడీ అధినేత.

ఈ నెల 30న కుష్వేశ్వర్​ అస్థాన్​(ఎస్​సీ), తారాపుర్​ నియోజకవర్గాలకు జరగనున్న ఉపఎన్నికల్లో.. ఆర్​జేడీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు లాలు ప్రసాద్​ యాదవ్(lalu yadav news bihar)​. రెండు నియోజకవర్గాల్లో తేజస్వీ జోరుగా ప్రచారాలు చేస్తున్నారని, ఎన్​డీఏకు బలమైన పోటీనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాను ఎన్​డీఏను(bihar nda news ) నిమజ్జనం చేస్తానని వెల్లడించారు.

సోదరుల మధ్య విభేదాలు..

గత కొంతకాలంగా తేజస్వీ- తేజ్​ప్రతాప్​ మధ్య విభేదాలు వార్తల్లో నిలిచాయి. తేజ్​ప్రతాప్​ సన్నిహితుడు, ఆర్​జేడీ రాష్ట్ర స్టూడెంట్​ వింగ్​ అధ్యక్షుడు ఆకాశ్​ యాదవ్​ను తేజస్వీ ఆ పదవి నుంచి తప్పించడం వల్ల సోదరుల మధ్య బంధం బలహీనపడిందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

అది జరిగిన కొద్ది రోజులకు.. 'మా నాన్నను కలిసేందుకు వెళ్తే, నన్ను అడ్డుకున్నారు,' అని తేజ్​ప్రతాప్​ ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఇక ఎంతమాత్రం ఆర్​జేడీలో భాగం కాదని, త్వరలోనే ఓ కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు.

ఇదీ చూడండి:-'కాంగ్రెస్​తో కలిసి పోటీ చేస్తే డిపాజిట్​ గల్లంతే'

ABOUT THE AUTHOR

...view details