తెలంగాణ

telangana

ఉగ్రకుట్ర భగ్నం- టిఫిన్​బాక్స్​ బాంబులు స్వాధీనం

By

Published : Sep 23, 2021, 7:08 PM IST

ఖలీస్థానీ ఉగ్రవాద సంస్థకు(Khalistan Movement) చెందిన ముగ్గురిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి మూడు పిస్టళ్లతో పాటు.. రెండు గ్రెనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

khalistan tiger force
khalistan tiger force

పంజాబ్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్​కు చెందిన ఉగ్రవాదులను(Khalistan Tiger Force Militants) పోలీసులు అరెస్టు చేశారు. తార్న్​తారన్​లోని భికివిండ్ ప్రాంతంలో ముష్కరులు(Khalistan Terrorist) ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు వీరిని విజయవంతంగా పట్టుకోగలిగారు. వారి వద్ద నుంచి రెండు టిఫిన్ బాక్సు బాంబులు, రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, మూడు 9 ఎంఎం పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెలరోజుల వ్యవధిలో పంజాబ్​లో రికవరీ చేసిన ఆరో టిఫిన్ బాంబు ఇది.

పోలీసులు స్వాధీనం చేసుకన్న టిఫిన్ బాంబు
హ్యాండ్ గ్రెనేడ్
ఉగ్రవాదుల వద్ద పేలుడు పదార్థాలు

"మాకు అందిన పక్కా సమాచారం ఆధారంగా ఉగ్రవాదులను అడ్డుకున్నాం. కానీ వారు పారిపోవడానికి ప్రయత్నించారు. మాపై కాల్పులు సైతం జరిపారు. అయితే చాకచక్యంతో వారిని అరెస్టు చేశాం."

-భిఖి వినిద్ సాహిబ్, ఎస్​హెచ్​ఓ.

అరెస్టయిన వారిని మోగాకు చెందిన కన్వర్పాల్ సింగ్, కుల్విందర్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు. వీరిలో కన్వర్‌పాల్ రెండు వారాల క్రితమే కెనడా నుంచి తిరిగి వచ్చానని పోలీసులకు చెప్పాడు. ఈ ముగ్గురూ కెనడాలోని కేటీఎఫ్ సంస్థ అధ్యక్షుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టళ్లు
మీడియా ఎదుట ఉగ్రవాదులు

ఈ ఏడాది ఆగస్టు 8న అమృత్‌సర్​లో టిఫిన్ బాంబులతో పాటు ఐదు హ్యాండ్ గ్రెనేడ్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా.. ఆగస్టు 20న ఫగ్వారాలో రెండు గ్రెనేడ్‌లు, ఒక టిఫిన్ బాంబును కపుర్తల పోలీసులు కనుగొన్నారు. అజ్నాలాలో ఓ ఆయిల్ ట్యాంకర్‌ను పేల్చేందుకూ ఈ సంస్థ పన్నిన కుట్రను భగ్నం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details