యూట్యూబ్‌లో వీడియోలు చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారుచేశాడు ఓ 12 ఏళ్ల యువకుడు. ఈ వైన్‌ను తన మిత్రుడికి ఇవ్వగా.. తాగిన అనంతరం అతడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకొని ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన కేరళ తిరువనంతపురం చిరాయింకీజులో శుక్రవారం జరిగింది.
కల్తీ మద్యం తాగిన బాలుడ్ని చిరాయింకీజులోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని పోలీసులు తెలిపారు. వైన్ బాటిల్‌ను స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు పోలీసులు. వైన్‌లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై కేసు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.