కేరళలో నిఫా వైరస్(Nipah virus) మరోసారి కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్ జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలుడు ఈ వైరస్ సోకి (symptoms of nipah virus) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. నిఫా వైరస్(nipah virus in kerala) కారణంగానే బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ధ్రువీకరించారు. మరణించిన బాలుడి మృతదేహం నుంచి నమూనాలను సేకరించిన 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-పుణె' సైతం నిఫాతోనే బాలుడు మృతిచెందినట్లు నిర్ధరించింది.
నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలుడి ఆరోగ్యం విషమించి శనివారం రాత్రి మరణించాడని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అయితే.. ఆసుపత్రిలో చేరిన బాలుడిలో నిఫా వైరస్ లక్షణాలు (nipah virus symptoms) కనిపించినప్పటికీ, ఉన్నతాధికారులు స్పందించలేదనే విమర్శలొచ్చాయి.
"బాలుడికి దగ్గరగా ఉన్నవారిని ఆరోగ్యశాఖ గుర్తిస్తోంది. ప్రస్తుతం గుర్తించిన వారిలో ఇప్పటివరకు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదు. ఎవరూ ఆందోళన చెందొద్దు. బాలుడి స్నేహితులు, కుటుంబాన్ని గుర్తించి ఐసోలేషన్కి తరలించాం."
-వీణా జార్జ్, కేరళ ఆరోగ్య మంత్రి