ఒకప్పుడు చాలా ప్రాంతాల్లో దళితులను గుడిల్లోకి అడుగు పెట్టేందుకు అనుమతినిచ్చేవారు కాదు. వారు దూరంగానే నిల్చుని దండం పెట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. పొరపాటున వారు గుళ్లోకి వస్తే కఠినంగా శిక్షించే వారు. అయితే ఈ లింగ వివక్షతను అడ్డుకునేందుకు కృష్ణ మోహన్ అనే వ్యక్తి.. కొంతమంది దళితులను వెంటబెట్టుకుని 2018లో కేరళలోని జడాధారి ఆలయంలోకి ప్రవేశించారు.
ఈ చర్యతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు దళితులను ప్రశ్నించారు. ఆచారాన్ని మట్టుబెట్టారని, దీని వల్ల దేవుడికి కోపం వస్తుందని దాదాపు నాలుగేళ్లు ఆ ఆలయాన్ని మూసివేశారు. ఇప్పటికి గుడిని తెరిచేందుకు గ్రామస్థులు ముందుకు వస్తున్నప్పటికీ కొన్ని వర్గాలవారు దీనికి ససేమిరా అంటున్నారు.