తెలుగుజాతి ఖ్యాతిని మరింతగా చాటుతూ దేశ సర్వోన్నత న్యాయపీఠాన్ని జస్టిస్ నూతలపాటి వెంకట రమణ అధిష్ఠించనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమణ.. భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో శనివారం జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్‌వీ రమణతో.. ప్రమాణం చేయిస్తారు.
ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ఈ మేరకు శనివారం.. దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా సీజేఐ పదవిని చేపట్టే రెండో తెలుగు వ్యక్తిగా ఆయన నిలుస్తారు. రాజమహేంద్రవరానికి చెందిన.. జస్టిస్ కోకా సుబ్బారావు.. భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ సుబ్బారావు తర్వాత సీజేఐ పదవికి ఎదిగిన రెండో వ్యక్తిగా జస్టిస్ రమణ నిలిచారు.
ఏప్రిల్ 6న ఉత్తర్వులు