తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సినీ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు.. ఆ స్టార్ హీరో​తో లింకులు! - tamil nadu producers it raids

Anbu Chezliyan IT raids : ప్రముఖ సినీ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ మెరుపు దాడులు చేయడం తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. చెన్నై, మధురై సహా మొత్తం 10 చోట్ల అన్బు చెళియన్​కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. కలైపులి ఎస్ థాను, ఎస్ఆర్ ప్రభు స్థలాలపైనా సోదాలు జరిపారు.

Anbu Chezliyan IT raids
ప్రముఖ ప్రొడ్యూసర్​ ఇంటిపై ఐటీ దాడులు

By

Published : Aug 2, 2022, 8:46 AM IST

Updated : Aug 2, 2022, 12:19 PM IST

Anbu Chezliyan IT raids : తమిళనాడు సినీ ప్రొడ్యూసర్ల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. తమిళనాడులో ప్రముఖ ఫైనాన్షియర్, చిత్ర నిర్మాత అన్బు చెళియన్​ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. ప్రముఖ ఫైనాన్షియర్, సినీ నిర్మాత అన్బు చెలియన్​కు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. చెన్నై, మధురై నగరాల్లోని ఆయనకు సంబంధించిన 10 స్థలాల్లో సోదాలు చేపట్టారు.

ఎస్ ఆర్ ప్రభు

మరో స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కలైపులి ఎస్ థాను కార్యాలయంపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నై టీ-నగర్​లోని ఆయన ఆఫీస్​కు వెళ్లిన అధికారులు.. సోదాలు చేపట్టారు. ఖైదీ, సుల్తాన్ చిత్రాల నిర్మాత ఎస్ఆర్ ప్రభుకు చెందిన ఇంటిపైనా దాడులు చేశారు. మరికొందరు నిర్మాతలపైనా సైతం ఐటీ శాఖ దృష్టిసారించిందని తెలుస్తోంది. వీరి ఇళ్లు, కార్యాలయాలపైనా దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం.

అన్బు చెళియన్

అన్బు చెళియన్​.. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫైనాన్షియర్. విజయ్​ నటించిన బిగిల్​ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఏజీఎస్​ ఎంటర్​టైన్​మెంట్​కు ఆయన ఆర్థిక వనరులు సమకూర్చారు. గోపురం ఫిలింస్ అనే బ్యానర్​పై కొన్ని సినిమాలు నిర్మించారు. 2020 ఫిబ్రవరిలోనూ ఇదే తరహాలో అన్బు చెళియన్​ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నై, మధురైలోని నివాసాల నుంచి రూ.65కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్బు చెళియన్​ స్నేహితుడు శరవణన్​ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. మధురైలోని నివాసం నుంచి రూ.15కోట్లు జప్తు చేశారు. అదే సమయంలో హీరో విజయ్ ఇళ్లలోనూ సోదాలు జరిపి, ఆయన్ను ప్రశ్నించారు. 2017లో తమిళ నటుడు శశికుమార్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సూసైడ్ నోట్​లో అంబు చెళియన్ పేరు రాశారు. దీనిపై సెంట్రల్ క్రైం బ్రాంచ్ కేసు నమోదు చేసుకుంది.

గోపురం కార్యాలయం

మరోలైపు, కలైపులి థానుకు రెండు బ్యానర్లు ఉన్నాయి. వీ క్రియేషన్స్, కలైపులి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అనే బ్యానర్లపై సినిమాలు నిర్మించారు. తుపాకీ, తేరి, కబాలి, అసురన్, కర్ణన్ సహా పలు చిత్రాలకు ప్రొడ్యూసర్​గా వ్యవహరించారు.

ఇదీ చదవండి:

Last Updated : Aug 2, 2022, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details