Insta Reels Infront Train Students Dead: ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ వీడియోలు విద్యార్థుల ప్రాణాలు తీసాయి. తమిళనాడు చెంగల్పట్టులో రైలు ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. రైలు ఎదుట నిలబడి రీల్స్ చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. వీరిని చెట్టిపున్నియం గ్రామానికి చెందిన అశోక్ కుమార్, ప్రకాశ్, మోహన్గా గుర్తించారు. విద్యార్థుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రాణాలు తీసిన రీల్స్ సరదా.. రైలు ఢీకొని ముగ్గురు యువకులు మృతి - తమిళనాడు చెంగల్పట్టు న్యూస్
Insta Reels Infront Train Students Dead: తమిళనాడు చెంగల్పట్టులో రైలు ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. రైలు ఎదుట నిలబడి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రాణం తీసిన సెల్ఫీ.. రైలు ఢీకొని ముగ్గురి మృతి..
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెంగల్పట్టు రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ యువకులు ఇంతకుముందు కూడా రైలు ముందు నిలబడి వీడియోలు తీసినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారందరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడం వల్ల ఆ ఊర్లో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి:ఫస్ట్ నైట్లో వధువు చెప్పిన నిజంతో వరుడు షాక్.. స్పాట్లోనే విడాకులు!