Indian Railway Horn Types and their Meanings in Telugu: ఒక రైలు సురక్షితంగా గమ్యం చేరాలంటే.. వ్యవస్థ మొత్తం సమన్వయంగా పనిచేయాలి. సిగ్నలింగ్ సిబ్బంది నుంచి లోకో పైలెట్, రైల్వే గార్డుల వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే.. అన్ని విషయాలు వైరెలెస్ సెట్ల ద్వారా పంచుకోడానికి సాధ్యం కాదు. అందుకే.. రైలు కూతల ద్వారా లోకో పైలెట్.. ఆ విషయాన్ని సిబ్బందికి తెలియజేస్తారు. హారన్ మోగిన తీరును గుర్తించి.. వెంటనే సిబ్బంది తదునుగుణంగా స్పందిస్తారు. మరి, ఆ 11 హారన్ల సంగతేంటో.. ఈ కథనంలో తెలుసుకుందాం.
- One Short Horn:మొదటిది వన్ షార్ట్ హారన్. రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు.. రైలును శుభ్రం చేసేందుకు సంబంధిత యార్డుకు తరలిస్తారు. ఆ సమయంలో ఈ హారన్ ఉపయోగిస్తారు. ఇది ఒకసారి మాత్రమే మోగుతుంది. దీంతో.. వెంటనే సిబ్బంది క్లీనింగ్ పనిలో చేరిపోతారు.
- Two Short Horn: రెండవది టు షార్ట్ హారన్.. ఈ హారన్‌ను కూడా చాలా తక్కువ సమయం పాటు వరుసగా రెండు సార్లు మోగిస్తారు. 2 షార్ట్ హారన్ ఇచ్చినప్పుడు.. రైలును స్టార్ట్ చేయడానికి రైల్వే సిగ్నల్‌ను డైరెక్ట్ చేయమని గార్డుకి సూచించినట్లు అర్థం.
- Three Smaller Horns: త్రీ షార్ట్ హారన్స్‌ను కూడా చాలా వెంట వెంటనే మూడుసార్లు మోగిస్తారు. లోకో పైలట్ ఇంజిన్‌పై నియంత్రణ కోల్పోయినప్పుడు వాక్యూమ్ బ్రేక్‌ను లాగాల్సిందిగా సిబ్బందికి సూచించడం కోసం ఈ హారన్‌ను ఉపయోగిస్తారు.
రైల్లో హాఫ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు - మీకు తెలుసా..?
- Four Smaller horns: ఫోర్ షార్ట్ హారన్‌ను కూడా లోకో పైలట్ చాలా తక్కువ సమయంపాటు వరుసగా నాలుగు సార్లు ఈ హారన్‌ను మోగిస్తారు. రైలులో ఏదైనా టెక్నికల్ సమస్య తలెత్తినప్పుడు.. రైలు ముందుకు కదలలేదని సూచించడానికి లోకో పైలట్ ఈ హారన్‌ను ఉపయోగిస్తారు.
- Continuous Horn: ఈ హారన్ ట్రైన్ రన్నింగ్‌లో ఉండగానే.. ఆగకుండా కాసేపు మోగుతూనే ఉంటుంది. సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఎక్కువగా ఈ హారన్ ఉపయోగిస్తారు. ఈ హారన్ ఓ రకంగా ప్రయాణికులకు అలర్ట్ లాంటిది. కొన్ని స్టేషన్ల వద్ద రైలు ఆగదని సూచిస్తూ ఈ హారన్ మోగిస్తూ స్టేషన్ మీదుగా వెళ్తుంది.
- One long horn and one short: ఈ హారన్.. రైలును స్టార్ట్ చేసే ముందు లోకో పైలట్ మోగిస్తారు. ఒక లాంగ్ హారన్ మోగిన తర్వాత షార్ట్ హారన్ ఉపయోగిస్తారు. రైలు ఇంజిన్‌ను స్టార్ట్ చేసేముందు బ్రేక్ పైప్ సిస్టమ్‌ను సెట్ చేయమని సిబ్బందికి సూచించేందుకు ఈ హారన్ ఉపయోగిస్తారు.