దేశంలో కరోనా కేసులు(Covid 19 India) సోమవారంతో పోలిస్తే భారీగా తగ్గాయి. కొత్తగా 29,689 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 3,14,40,951
- మొత్తం మరణాలు: 4,21,382
- కోలుకున్నవారు: 3,06,21,469
- యాక్టివ్ కేసులు: 3,98,100
వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 44,19,12,395కు చేరినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది.