సమగ్ర స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై శనివారం భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ)ల మధ్య చర్చలు జరగనున్నాయి. ఎనిమిదేళ్ల విరామం అనంతరం ఇవి పునఃప్రారంభం కానుండడం గమనార్హం. వర్చువల్ విధానంలో జరిగే ఈ చర్చల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈయూ ఉన్నత శ్రేణి నాయకులు పాల్గొననున్నారు.
భారత్-ఈయూ చర్చలు.. పాల్గొననున్న మోదీ
ఎనిమిదేళ్ల విరామం అనంతరం.. సమగ్ర స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్-యూరోపియన్ల మధ్య శనివారం చర్చలు జరగనున్నాయి. వర్చువల్గా జరిగే ఈ చర్చల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.
భారత్-ఈయూ చర్చలు
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కోసం 2007 జూన్లో చర్చలు ప్రారంభమయ్యాయి. కీలక అంశాలపై అవగాహన కుదరకపోవడం వల్ల 2013 మేలో ప్రతిష్టంభన ఏర్పడింది.
ఇదీ చూడండి:భారత్‌కు సాయంగా అమెరికా నుంచి 'మెర్సీషిప్'
Last Updated : May 7, 2021, 6:19 AM IST