తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కలవరం.. దేశంలో మళ్లీ పెరిగిన కేసులు

India Covid cases: భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 4,518 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 9 మంది చనిపోయారు. ఆదివారం 2,779 మంది కోలుకున్నారు.

COVID CASES
COVID CASES

By

Published : Jun 6, 2022, 9:31 AM IST

India Corona cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 4,518 మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 9 మంది చనిపోయారు. ఆదివారం 2,779 మందికి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.73 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.

  • దేశంలో మొత్తం కరోనా కేసులు: 4,31,81,335‬
  • మొత్తం మరణాలు: 5,24,701
  • యాక్టివ్​ కేసులు:25,782
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,30,852

Vaccination India: దేశవ్యాప్తంగా ఆదివారం 2,57,187 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,12,87,000కు చేరింది. మరో 2,78,059 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 297,830 మంది వైరస్​ బారినపడ్డారు. 476 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 506,274,649కు చేరింది. మరణాల సంఖ్య 6,320,335కు చేరింది. ఒక్కరోజే 443,857 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 506,274,649గా ఉంది.

  • ఉత్తర కొరియాలో 73 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
  • తైవాన్​లో శనివారం 62,110 మంది మహమ్మారి​ బారినపడ్డారు. 124 మంది మరణించారు
  • ఆస్ట్రేలియాలో 22,253 మందికి వైరస్​కు సోకింది. 29 మంది చనిపోయారు.
  • ఫ్రాన్స్​లో 20,542 కొత్త కేసులు వెలుగుచూశాయి.
  • అమెరికాలో 19,504 కొత్త కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి.

ఇవీ చదవండి:చార్​ధామ్​ యాత్రలో విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 26మంది దుర్మరణం

మన జాతీయ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details