India Corona Cases: దేశంలో కొవిడ్ కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 3,451 కేసులు నమోదయ్యాయి. 40 మంది చనిపోయారు. మరో 3079 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.05 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,02,194
- మొత్తం మరణాలు: 5,24,064
- యాక్టివ్ కేసులు: 20,635
- కోలుకున్నవారి సంఖ్య: 4,25,57,495
Vaccination India: దేశవ్యాప్తంగా శనివారం 17,39,403 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,90,20,07,487కు చేరింది. నిన్న ఒక్కరోజే 3 లక్షల 60 వేలకుపైగా కరోనా టెస్టులు నిర్వహించింది కేంద్రం.
World Covidcases:ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా మొత్తం 4 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 1000 మందికిపైగా మరణించారు.
- జర్మనీలో శనివారం 48 వేల కేసులు.. 102 మరణాలు సంభవించాయి.
- ఇటలీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 40 వేలమందికిపైగా వైరస్ బారినపడ్డారు. 113 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలోనూ దాదాపు 40 వేల కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి.
- ఫ్రాన్స్‌లో 37 వేల మందికి వైరస్ సోకగా.. మరో 62 మంది చనిపోయారు.
- అమెరికాలో 31 వేల కేసుులు, 87 మరణాలు నమోదయ్యాయి.