తెలంగాణ

telangana

By

Published : Aug 12, 2021, 4:04 AM IST

ETV Bharat / bharat

దేశంలోనే మొదటిసారి.. ఆ పార్కులో శాటిలైట్​ ఫోన్లు

వన్య మృగాల సంరక్షణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా అసోంలోని కాజీరంగా జాతీయ పార్కులో శాటిలైట్‌ ఫొన్‌లను ప్రవేశపెట్టారు. పార్కు సిబ్బందికి 10 ఫోన్లను ఆ రాష్ట్ర సీఎస్ పంపిణీ చేశారు.

satelite phones in kaziranga park
శాటిలైట్​ ఫోన్లు

వన్య మృగాల సంరక్షణ కోసం అసోంలోని కాజీరంగా జాతీయ పార్కు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా శాటిలైట్​ ఫోన్​లను ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో పార్కులోని వన్య మృగాలకు పటిష్ఠ భద్రత కల్పించే అవకాశం ఉందని ఉద్యానవన అధికారులు తెలిపారు.

అటవీ సిబ్బందికి 10 ఫోన్లను అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా బుధవారం అందజేశారు. రూ.16 లక్షల అంచనా వ్యయంతో అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వీటిని కొనుగోలు చేసింది. బీఎస్​ఎన్​ఎల్​ సంస్థ వీటికి సర్వీస్​ ప్రొవైడర్​గా వ్యవహరిస్తోంది. ఈ ఫోన్​ల వాడకంపై పార్కు సిబ్బందికి బీఎస్​ఎన్​ఎల్​ సంస్థ శిక్షణ ఇచ్చింది.

దాదాపు 2,500 ఖడ్గమృగాలకు ఆవాసమైన.. కాజీరంగా జాతీయ పా‌ర్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

ఇదీ చూడండి:మరో 3 ప్రాంతాల్లో సుప్రీం కోర్టు బెంచ్​లు- నిజమేనా?

ఇదీ చూడండి:ఆ దేశాల నుంచే ఎక్కువ పోర్న్​.. మన​ స్థానం ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details