తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాన్నే.. అమ్మని చంపేశాడు'.. పోలీసులకు చెప్పిన నాలుగేళ్ల కూతురు - గన్​తో కాల్చుకొని కానిస్టేబుల్​ ఆత్మహత్య

బిహార్​లో ఓ వ్యక్తి అతడి భార్యని అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ తోటలో పడేశాడు. అయితే తన తండ్రే.. అమ్మని చంపాడంటూ అతడి నాలుగేళ్ల కుమార్తె పోలీసులకు తెలిపింది. మరో ఘటనలో భార్య ఆరోగ్యం సరిగా లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. తన ఇద్దరి పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

husband killed wife in Bhagalpur
భార్యను చంపిన భర్త

By

Published : Jan 7, 2023, 9:08 PM IST

Updated : Jan 7, 2023, 10:51 PM IST

బిహర్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి అతడి భార్యను అతికిరాతంగా హత్య చేశాడు. ముఖంపై ఇటుకతో కొట్టి హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని ఓ తోటలో పడేశాడు. అయితే రాత్రి సమయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. అయితే కోపోద్రిక్తుడైన తండ్రే.. తన తల్లిని హత్య చేశాడని వారి నాలుగేళ్ల కుమారై పోలీసులకు చెప్పింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భాగల్​పుర్​లోని నాథ్​నగర్​ ప్రాంతంలో ఉండే పంకజ్​ యాదవ్​ అనే వ్యక్తి 26 ఏళ్ల భార్య ఇషా దేవిని హత్య చేశాడు. అయితే రాత్రి సమయంలో భార్యభర్తలు గొడవపడ్డారు.. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన పంకజ్​.. బయట నుంచి ఇటుక తెచ్చి ఇషా మఖంపై దాడి చేశాడు. అనంతరం ఆమె మృతి చెందగా శవాన్ని దగ్గర్లోని ఓ తోటలో పడేశాడు. ఉదయం తోటకు వెళ్లిన కొందరు ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ హత్యను పంకజ్​, ఇషాల నాలుగేళ్ల కుమారై ప్రత్యక్షంగా చూసి పోలీసులకు చెప్పింది.

"మా నాన్న అమ్మను ఎప్పుడూ కొట్టేవాడు. రాత్రి ఇద్దరి మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. ఆ తర్వాత నాన్న ఇటుకతో కొట్టి అమ్మను చంపాడు" అని మృతురాలి నాలుగేళ్ల కుమారై వెల్లడించింది. ప్రస్తుతం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పరారిలో ఉన్న పంకజ్ ​కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య.. భార్య అనారోగ్యమే కారణం..!
భార్య ఆరోగ్యం సరిగా లేదని ఓ వ్యక్తి తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక కలబురగిలోని అలంద ప్రాంతంలో గురువారం సాయంత్రం జరిగిందీ ఘటన. సిద్దరుడ మహామల్లప్ప అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అతడి భార్యకు ఆరోగ్యం దెబ్బతింది. ఆమె వైద్యం కోసమని సిద్దరుడ చాలా అప్పులు చేశాడు. అనేక ఆస్పత్రులకు తిప్పినా కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సిద్దరుడ.. తన 11 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమారైతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకొన్న పోలీసులు మృతదేహాలను బావినుంచి బయటకు తీసి.. శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

భార్యతో గొవడపడి.. కానిస్టేబుల్​ ఆత్మహత్య
బిహార్​లో కుటుంబ కలహాల కారణంగా ఓ కానిస్టేబుల్​ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గంజన్​ కుమార్​ అనే కానిస్టేబుల్​ జమూయి పోలీస్​స్టేషన్​​ పరిధిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. శనివారం తన భార్యతో ఏదో విషయంలో గొడవపడిన గంజన్..​ కోపంతో తన సర్వీస్​ రివాల్వర్​తో కాల్చుకున్నాడు. అతన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

వీడియో తీసి యువకుడు ఆత్మహత్య..
మధ్యప్రదేశ్​ ఇందోర్​లో ఓ యువకుడు ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. జీవనోపాధి కోసం జనవరి 4 దేవాస్​ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడకు చేరుకున్న తర్వాత ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడం వల్ల ఆత్మహత్య చేసుకొంటున్నట్లు తన భార్యకు ఓ వీడియో పంపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతనికి ఉద్యోగం లేదనే కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Last Updated : Jan 7, 2023, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details