తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యపై కోపం.. మరో ఇద్దరిని పిలిపించి గ్యాంగ్​ రేప్​

Husband Forced Gang Rape Of Wife: భార్యపై కోపంతో దారుణానికి తెగించాడో వ్యక్తి. మరో ఇద్దరిని పిలిపించి.. ఆమెపై సామూహిక అత్యాచారం చేసేలా ప్రోత్సహించాడు. ఆ ఇద్దరూ.. భర్త కళ్లెదుటే ఆ మహిళపై అఘాయిత్యం చేశారు. ఈ భయానక ఘటన మహారాష్ట్ర ఔసాలోని సారోలా ప్రాంతంలో జరిగింది.

Husband Forced Farm Owner To Gang Rape Of Wife
Husband Forced Farm Owner To Gang Rape Of Wife

By

Published : Apr 17, 2022, 2:34 PM IST

Husband Forced Gang Rape Of Wife: మహారాష్ట్రలో పాశవిక ఘటన వెలుగుచూసింది. కుటుంబకలహాల కారణంగా.. ఓ వ్యక్తి భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఔసా తాలూకా సారోలా వద్ద తన పొలం యజమాని, అతని సోదరుడిని పిలిపించి.. తన భార్యపై సామూహిక అత్యాచారం చేయించాడు. దిగ్భ్రాంతికర విషయం ఏంటంటే.. బాధితురాలు తనపై అఘాయిత్యం జరిగిన అనంతరం అర్ధరాత్రి 15 కి.మీ. నడిచి లాతూర్​లోని రెండు పోలీస్​ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది.

ఇదీ జరిగింది: నిలంగా ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి సారోలా రోడ్​ వద్ద వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటోంది. కొద్దిరోజుల క్రితం దంపతుల మధ్య గొడవతో.. ఆమె లాతూర్​లోని తన తల్లి వద్దకు వెళ్లింది. ఆమె సర్దిచెప్పి మళ్లీ బాధితురాలిని తన పొలం వద్ద దిగబెట్టి వెళ్లింది. ఏప్రిల్​ 9న దంపతుల మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి రాత్రి 9 గంటల ప్రాంతంలో తన పొలం యజమాని, అతడి సోదరుడు.. ఇల్లు షేక్​, మూసా షేక్​ను పిలిపించాడు. తన భార్యపై అత్యాచారం చేయాలని నిందితుడు ప్రోత్సహించగా.. భర్త కళ్లెదుటే ఆ ఇద్దరూ మహిళపై దారుణానికి పాల్పడ్డారు.

ఘటన తర్వాత.. మహిళ అర్ధరాత్రి 15 కి.మీ. నడిచి స్థానిక పోలీస్​ స్టేషన్​ సహా వివేకానందా చౌక్​ ఠాణాను ఆశ్రయించినా ఎవరూ పట్టించుకోలేదు. జిల్లా ఎస్​పీ నిఖిల్​ పింగాలేను కలవాలని సూచించారు. ఆ తర్వాత బాధితురాలు తన తల్లితో కలిసి ఎస్​పీని కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో నిందితులపై కేసు నమోదు చేయాలని ఔసా పోలీసులను ఆదేశించారు ఎస్​పీ. అనంతరం ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:మైనర్​పై అత్యాచారం.. ఆపై వీడియో తీసి వైరల్​ చేసిన కీచకుడు

భార్య, కుమారుడి హత్య.. వాట్సాప్​ గ్రూప్​లో మెసేజ్​ చేసి మరీ..

ABOUT THE AUTHOR

...view details