తెలంగాణ

telangana

By

Published : Aug 2, 2021, 4:13 AM IST

ETV Bharat / bharat

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
రాశి ఫలం

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృషభం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలతో కాలాన్ని గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆపదలు తొలుగుతాయి.

మిథునం

మీమీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో తోటివారి సహాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. శని శ్లోకాలు చదివితే బాగుంటుంది.

సింహం

వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

కన్య

కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకము చదివితే బాగుంటుంది.

తుల

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం పఠించడం మంచిది.

వృశ్చికం

మనస్సౌఖ్యం కలదు. ధర్మకార్యాచరణతో లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

ధనస్సు

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఆర్థికవృద్ధి ఉంది. నారాయణ మంత్రాన్ని జపించాలి.

మకరం

మీమీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. గణపతి స్తోత్రం చదవితే మంచి జరుగుతుంది.

కుంభం

ప్రతి అడుగు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వేయండి. ముఖ్యవిషయాల్లో చంచలస్వభావాన్ని రానీయకండి. చంద్ర ధ్యానం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

మీనం

మీమీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details