తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (15-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - ఈ రోజు రాశి ఫలం

Horoscope Today(15-10-2021): ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

By

Published : Oct 15, 2021, 3:43 AM IST

ఈరోజు (15-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం

శుక్లపక్షం దశమి: రా. 8.20 తదుపరి ఏకాదశి

శ్రవణం: మ. 12.36 తదుపరి ధనిష్ఠ

వర్జ్యం: సా. 4.30 నుంచి 6.03 వరకు

అమృత ఘడియలు: రా.1.51 నుంచి 3.25 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.16 నుంచి 9.02 వరకు తిరిగి మ.12.09 నుంచి 12.56 వరకు

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

సూర్యోదయం: ఉ.5-56, సూర్యాస్తమయం: సా.5-37

విజయదశమి, అపరాజితాదేవి పూజ, దుర్గా సరస్వత్యుద్వాసన

మేషం

శుభ సమయం. మీ మీ రంగాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృషభం

ప్రారంభించిన పనిలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

మిథునం

మనస్సౌఖ్యం ఉంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కర్కాటకం

మంచి ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.

సింహం

మనోబలం సర్వదా రక్షిస్తుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. కొన్ని విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు అందుతాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.

కన్య

స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీవిష్ణు నామాన్ని పఠించడం మంచిది.

తుల

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు,మిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం

ప్రారంభించిన కార్యక్రమాలలో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

ధనుస్సు

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన శుభప్రదం.

మకరం

గొప్ప ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు దుర్గాధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

కుంభం

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కీలక విషయాలను కొన్నాళ్లు వాయిదా వేసుకుంటే మంచిది. కలహసూచన ఉంది. ఇష్ట దైవప్రార్థన మేలు చేస్తుంది.

మీనం

చక్కని విజయాలు ఉన్నాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేయాలి.

ఇదీ చూడండి :దుర్గా మండపంలో కాల్పులు- ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details