తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 17 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - ఈరోజు రాశి ఫలాలు కర్కాటకం

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
రాశిఫలాలు

By

Published : Jul 17, 2021, 5:00 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం

వృషభం

కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయం వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

మిథునం

మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.

కర్కాటకం

ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

సింహం

మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు.

కన్య

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

తుల

ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.

వృశ్చికం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలతో మార్పులు కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి. లింగాష్టకం చదవండి.. మంచి జరుగుతుంది.

ధనుస్సు

తలపెట్టిన కార్యక్రమాలలో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

మకరం

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శని ధ్యానం శుభప్రదం

కుంభం

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. చేసే పనిలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. మనోబలం సడలకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆంజనేయ ఆరాధన చేయాలి.

మీనం

చేపట్టే పనులలో పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details