ఈద్-అల్-అధా పర్వదినాన్ని పురస్కరించుకొని హజ్ యాత్రకు వెళ్లాలనుకునేవారికి తీపి కబురు. 2021 హజ్ యాత్రకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 7నుంచి ప్రారంభం కానుంది. డిసెంబరు 10వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు భారత హజ్ కమిటీకి స్పష్టత నిచ్చింది.
'హజ్'యాత్రకు గ్రీన్‌సిగ్నల్.. దరఖాస్తులకు తేదీలివే - haj tour application dates
హజ్‌యాత్ర-2021 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది కేంద్రం. ఈ ప్రక్రియ నవంబరు 7 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది. డిసెంబర్ 10వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది.

హజ్‌యాత్రపై వీడిన అనిశ్చితి -దరఖాస్తు తేదీలను ప్రకటించిన కేంద్రం
కరోనా దృష్ట్యా గత విధానాల్లో కొన్ని మార్పులను చేసింది హజ్ కమిటీ. వయోపరిమితి, అర్హత తదితర అంశాలపై నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. హజ్ యాత్ర సందర్భంగా ఇప్పటికే భారత్-సౌదీ విమాన సర్వీసులపై ఒప్పందాలు కుదిరాయి.