Google Removed 17 Apps : తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామని వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్న 17 మోసపూరిత ఆండ్రాయిడ్ ఆన్లైన్ రుణ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించింది ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్. స్లోవాక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ESET ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 5న ఈ హానికరమైన అప్లికేషన్లను ఆండ్రాయిడ్ డివైజుల్లో గుర్తించింది గూగుల్. SpyLoanగా పేర్కొనే ఈ రకమైన యాప్స్‌ను ఈ ఏడాది దాదాపు 1.2 కోట్ల మంది యూజర్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు.
ఈ స్పైలోన్ యాప్‌లు చట్టబద్ధమైన పర్సనల్ లోన్ సర్వీసెస్ అప్లికేషన్లుగా చెప్పుకుంటూ ఫండ్స్‌ను త్వరగా మరింత సులభతరంగా యాక్సెస్ చేసుకోవచ్చనే నమ్మకాన్ని యూజర్స్‌కు కలిగిస్తున్నాయని రిపోర్ట్ నివేదించింది. అంతేకాకుండా రకరకాల ఆకర్షణీయమైన ఆఫర్స్‌తో పాటు మార్కెట్ వడ్డీ రేటు కంటే తక్కువ శాతం వడ్డీలను ప్రకటిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని సాఫ్ట్‌వేర్ సంస్థ ESET వెల్లడించింది. చివరకు బాధితుల బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని లోన్ యాప్‌లు సేకరించి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును దండుకుంటున్నాయని నివేదికలో చెప్పింది.
ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన SpyLoan యాప్స్ ఇవే(Google Play Store Removed Apps List)
- AA Kredit
- Amor Cash
- GuayabaCash
- EasyCredit
- Cashwow
- CrediBus
- FlashLoan
- PréstamosCrédito
- Préstamos De Crédito-YumiCash
- Go Crédito
- Instantáneo Préstamo
- Cartera grande
- Rápido Crédito
- Finupp Lending
- 4S Cash
- TrueNaira
- EasyCash
ఈ రుణ యాప్‌లు ప్రధానంగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది.