Gang Rape On Dalit Sisters: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మార్కెట్‌కు వెళ్లి వస్తున్న ఇద్దరు దళిత అక్కచెల్లెళ్లపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారు.
పోలీసుల వివరాల ప్రకారం..జిల్లాలోని బికాపుర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు దళిత అక్కచెల్లెళ్లు సోమవారం సాయంత్రం షేర్పూర్ పారా బజార్‌కు వెళ్లారు. షాపింగ్ ముగించుకుని వస్తున్న సమయంలో ఓ నలుగురు యువకులను వారిద్దరిని చెరకు తోటలోకి బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారు.
మార్కెట్‌కు వెళ్లి చాలా సేపు అయినా బాధితురాళ్లు ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. చెరకు తోటలో ఏడ్చుకుంటూ కూర్చున్న బాధితులను గుర్తించి విషయం అడిగి తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం బాధితురాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
గోడపై సూసైడ్ నోట్ రాసి వివాహిత ఆత్మహత్య..
అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవనర్మణానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు.. గోడపై ఎర్రటి సిరాతో సూసైడ్ నోట్ రాసింది బాధితురాలు. తన మరణానికి భర్తే కారణమని పేర్కొంది. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని ఖలారీ ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తిని బాధితురాలు చందాదేవి 2019లో వివాహం చేసుకుంది. పెళ్లైనప్పటి నుంచి చందాదేవిని అత్తమామలు, భర్త.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఆ తర్వాత చందాదేవికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. దీంతో వేధింపులు మరింత పెరిగిపోయాయి. కన్నవారింటి నుంచి రూ.15 లక్షలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అందుకు చందాదేవి నిరాకరించడం వల్ల ఆహారం పెట్టకుండా దారుణంగా కొట్టారు.
ఇక ఈ వేధింపులు తాళలేక బాధితురాలు బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అనంతరం గోడను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. తాను ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటినీ గోడపై ఎర్రటి సిరాతో రాసింది చందాదేవి. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె భర్త దిలీప్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.